Begin typing your search above and press return to search.

గులాబీ బ్యాచ్ లో టికెట్ల లెక్క‌ల చిక్కులు?

By:  Tupaki Desk   |   20 Nov 2017 4:05 AM GMT
గులాబీ బ్యాచ్ లో టికెట్ల లెక్క‌ల చిక్కులు?
X
ప‌వ‌ర్ లో మేమే ఉండాలి. మాకు ప్ర‌త్యామ్నాయం ఉండ‌కూడ‌దు. అధికార పక్షం మేమే.. విప‌క్షం మేమే. అంతా మేమే. మేము త‌ప్ప మ‌రెవ‌రికీ రాజ‌కీయాల్లోస్థానం లేద‌న్న‌ట్లుగా ఇప్ప‌టి రాజ‌కీయాలు మారిపోయాయి. ప్ర‌త్య‌ర్థులు అన్న వారు లేకుండా చేయ‌ట‌మే ల‌క్ష్యంగా మొద‌లెట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఇప్పుడు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

వైరిప‌క్షంలో ఉన్న బ‌ల‌మైన నేత‌ల్ని పార్టీలోకి తీసుకురావ‌టంతో ప్ర‌త్య‌ర్థుల‌కు దిమ్మ తిరిగే షాకు ఇవ్వాల‌న్న ప్లాన్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చ‌క్క‌గా అమ‌లు చేశారు.

ఇంత వ‌ర‌కు అంతా బాగున్నా.. ఇప్పుడే అస‌లు స‌మ‌స్య మొద‌లైంద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్న వేళ‌.. సిట్టింగ్ లు త‌మ టికెట్ల సంగ‌తి ఏమిట‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో బీటీ బ్యాచ్ సైతం త‌మ‌దే ఫ్యూచ‌ర్ అంటూ లెక్క‌లు వేసుకోంటోంది. ఇదే ఇప్పుడు అధికార‌పక్ష అధినేత‌కు కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతోంది.

త‌మ పార్టీ గెల‌వ‌ని నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు గెలిచిన చోటు కూడా ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌కు ఎర్ర తివాచీ వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరే స‌మ‌యంలో ఎవ‌రికి వారికి క‌స్ట‌మైజ్డ్ హామీలు ఇవ్వ‌టం జ‌రిగింది. మ‌రిప్పుడు వాటి అమ‌లు ఆస‌క్తిక‌రంగా మారింది. రానున్న రోజుల్లో కేసీఆర్ కు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తాలుకూ తిప్ప‌లు భారీగా ఉంటాయ‌న్న అంచ‌నా వ్య‌క్త‌మ‌వుతోంది.

సిట్టింగ్‌ ల‌కు షాకిచ్చేలా వైరి వ‌ర్గం నుంచి పార్టీలోకి వ‌చ్చిన బ‌ల‌మైన నేత‌ల కార‌ణంగా దాదాపు 30 వ‌ర‌కు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ల పంపిణీ సంక్లిష్టం అవుతుంద‌న్న మాట వినిపిస్తోంది. ఇందుకు ప‌ర్ ఫెక్ట ఉదాహ‌ర‌ణ‌గా తెలంగాణ రాష్ట్ర స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి ముచ్చ‌ట‌ను చెబుతున్నారు. భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగిన ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. మ‌ధుసూద‌నాచారికి పోటీగా టీడీపీ ఇన్ చార్జి గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు పొత్తులో భాగంగా బీజేపీ త‌ర‌ఫు నుంచి పోటీ చేశారు. 7583 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇటీవ‌ల ఆయ‌న గులాబీ కారు ఎక్కేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఖాయ‌మ‌న్న హామీతో ఆయ‌న పార్టీలో చేరిన‌ట్లు చెబుతారు.

అదే నిజ‌మైతే.. స్పీక‌ర్ మాటేమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఈ స‌మ‌స్య ఒక్క భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం కాలేద‌ని దాదాపు పాతిక నుంచి 30 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంద‌ని చెబుతున్నారు. ఇలా ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఒక‌రి కంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్న బ‌ల‌మైన నేత‌లు పెద్ద ఎత్తున ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే మ‌రోవైపు సిట్టింగ్‌ ల‌కు టికెట్లు ఖాయ‌మ‌న్న మాట ఈ మ‌ధ్య‌నే కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చింది.

ఇదే నిజ‌మైతే.. కొత్త‌గాపార్టీలోకి వ‌చ్చిన వారి సంగ‌తేంటి? వారికిచ్చిన హామీల మాటేమిటి? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. సిట్టింగ్ ల‌కు టికెట్లు ఇస్తామ‌ని చెప్పినా.. గెలిచే అవ‌కాశం లేని వారికి ఇచ్చే ప్ర‌స‌క్తే లేదంటున్నారు. ఏది ఏమైనా టికెట్ల పంపిణీ వ్య‌వ‌హారం కేసీఆర్‌ కు క‌త్తి మీద సాముగా మారుతుంద‌ని చెబుతున్నారు. అంద‌రిని సంతృప్తి ప‌ర్చాలంటే నియోజ‌క‌వ‌ర్గాల పెంపు త‌ప్ప‌దంటున్నారు. అయితే.. అదంత తేలికైన సంగ‌తి కాదు.ఏది ఏమైనా టికెట్ల పంపిణీ వ్య‌వ‌హారం టీఆర్ ఎస్ అధినేత‌కు రానున్న రోజుల్లో కొత్త చిక్కుల్ని తీసుకొస్తుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

పోటాపోటీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు.. టికెట్లు ఆశిస్తున్న ఆశావాహుల లెక్క‌ను చూస్తే..

లోక్‌ సభ నియోజకవర్గాలు..

= పెద్దపల్లి: సిటింగ్‌ ఎంపీ బాల్క సుమన్‌,. కొత్త‌గా టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ జి.వివేకానంద

= నాగర్‌ కర్నూలు: మందా జగన్నాథం (కాంగ్రెస్ నుంచి వ‌చ్చారు) పి.రాములు (టికెట్‌ ను ఆశిస్తున్నారు)

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు

+ శేరిలింగంపల్లి: సిటింగ్‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ - శంకర్‌ గౌడ్‌ - జగదీశ్వర్‌ గౌడ్‌ - రాగం నాగేందర్‌ గౌడ్‌

+ రాజేంద్రనగర్‌: సిటింగ్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ - శాసన మండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ - స్వర్ణలతా రెడ్డి, టి.శ్రీనివాసరెడ్డి

+ కుత్బుల్లాపూర్‌: సిటింగ్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద - కొలను హన్మంతరెడ్డి

+ కూకట్‌పల్లి: సిటింగ్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - గొట్టిముక్కల పద్మారావు

+ మేడ్చల్‌: సిటింగ్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి - హరివర్థన్‌ రెడ్డి - నక్క ప్రభాకర్‌ గౌడ్‌

+ ఇబ్రహీంపట్నం: సిటింగ్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి - కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి

+ వరంగల్‌ తూర్పు: సిటింగ్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ - మాజీ మంత్రి బస్వరాజు సారయ్య - మాజీ ఎంపీ గుండు సుధారాణి - ఎర్రబెల్లి ప్రదీప్ రావు - అచ్చ విద్యాసాగర్‌

+ భూపాలపల్లి: మధుసూదనాచారి - గండ్ర సత్యనారాయణరావు

+ చేవెళ్ల: సిటింగ్‌ ఎమ్మెల్యే కాలె యాదయ్య (కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ ఎస్ లో చేరారు) - మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ .రత్నం

షాద్‌నగర్‌: సిటింగ్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ - అందె బాబయ్య - వీర్లపల్లి శంకర్‌ - కొందూటి నరేందర్‌

వికారాబాద్‌: సిటింగ్‌ ఎమ్మెల్యే సంజీవరావు - చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

+ మహేశ్వరం: సిటింగ్‌ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి లేదా ఆయన కోడలు డాక్టర్‌ తీగల అనితా రెడ్డి - కొత్త మనోహర్‌ రెడ్డి

+ అచ్చంపేట: సిటింగ్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు - మాజీ మంత్రి పి.రాములు

+ కల్వకుర్తి: ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ - మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజితా రెడ్డి

+ నారాయణపేట: సిటింగ్‌ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి - శివకుమార్‌ రెడ్డి

+ ఖానాపూర్‌: సిటింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ - మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌

+ నిజామాబాద్‌ రూరల్‌: సిటింగ్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ - ఎమ్మెల్సీ భూపతిరెడ్డి

+ మథిర: జడ్పీ చైర్‌ పర్సన్‌ గడిపల్లి కవిత - బొమ్మెర రామ్మూర్తి - లింగాల కమల్‌ రాజ్‌

+ మునుగోడు: సిటింగ్‌ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి - ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌

+ దేవరకొండ: సిటింగ్‌ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ (సీపీఐ నుంచి గెలిచి టీఆర్‌ ఎస్ లో చేరారు) - మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్‌

+ మిర్యాలగూడ: సిటింగ్‌ ఎమ్మెల్యే భాస్కర్‌ రావు (కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ ఎస్ లో చేరారు) - అలుగుపెల్లి అమరేందర్‌ రెడ్డి

+ కొడంగల్‌: ఎమ్మెల్సీ నరేందర్‌ రెడ్డి -మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి లేదా ముద్దప్ప దేశ్‌ ముఖ్‌

+ నల్లగొండ: భూపాల్‌ రెడ్డి - నర్సింహా రెడ్డి