Begin typing your search above and press return to search.
ఆపరేషన్ బందర్.. దాయాదిపై దాడి!
By: Tupaki Desk | 22 Jun 2019 5:23 AM GMTకుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్న రీతిలో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ లోని బాలాకోట్ లో భారత వైమానిక దళం చేపట్టిన మెరుపుదాడులకు సంబంధించి ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో.. భారత్ లోని వివిధ వైమానిక స్థావరాల నుంచి పాక్ లోని బాలాకోట్ ప్రాంతంలో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేయటం తెలిసిందే.
ప్రధాని మోడీ పర్యవేక్షణలో ఎంతో రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్ సంచలనంగా మారటమే కాదు.. పాక్ కు సరైన రీతిలో బుద్ది చెప్పిందన్న మాట పలువురి నోటి వెంట వినిపించింది. మెరుపు దాడులతో శత్రువును చావు దెబ్బ తీయటమే కాదు.. ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోకుండా తిరిగి వచ్చిన వైనం సంచలనంగా మారటం తెలిసిందే.
ఎంతో సీక్రెట్ గా సాగిన ఈ ఎయిర్ స్ట్రైక్స్ కు ఎయిర్ ఫోర్స్ విభాగం వారు పెట్టుకున్న సాంకేతిక నామం ఆపరేషన్ బందర్. ఇంతకూ బాలాకోట్ దాడికి ఆపరేషన్ బందర్ అని కోడ్ నేమ్ పెట్టుకోవటానికి ఆసక్తికర అంశాన్ని చెబుతున్నారు. బందర్ అంటే కోతి. రామాయణంలో రాముడి వీరభక్తుడైన హనుమంతుడు లంకకు వెళ్లి ఎంతలా రచ్చ చేస్తారో తెలిసిందే కదా. అదే రీతిలో కుట్రతో ఉగ్రదాడులకు పాల్పడుతున్న శత్రువు పీచమణిచేందుకు వీలుగా చేస్తున్న మెరుపుదాడులకు ఈ పేరు అయితే సరిపోతుందన్న ఉద్దేశంతో ఆపరేషన్ బందర్ గా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ తర్వాత భారత వైమానిక స్థావరాల మీద పాక్ వాయుసేన భారత్ మీదకు ప్రతిదాడికి దిగే ప్రయత్నం చేయటం.. ఆ యుద్ధ విమానాల్లో ఒకదాన్ని కూల్చేసి.. మరోదాని సంగతి చూసే క్రమంలో మన వింగ్ కమాండర్ అభినందన్ వర్దన్ పాక్ భూభాగంలో చిక్కుకుపోవటం తెలిసిందే. భారత్ నుంచి అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడితో ఆయన్ను విడిచి పెట్టేందుకు పాక్ ఒప్పుకోవటంతో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్రిక్తతలు ఒక్కసారిగా చల్లబడ్డాయి.