Begin typing your search above and press return to search.

ఓల్డ్ సిటీలో 'ఆపరేషన్ చబుత్ర' : ఏం జరిగిందంటే..?

By:  Tupaki Desk   |   22 July 2022 9:42 AM GMT
ఓల్డ్ సిటీలో ఆపరేషన్ చబుత్ర : ఏం జరిగిందంటే..?
X
యువత పెడదారి పట్టకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిత్యం తనిఖీలు చేస్తూ వారిని సరైన దారిలో పెడుతున్నారు. గతంలో నిర్వహించిన 'ఆపరేషన్ చబుత్ర'ను మళ్లీ నిర్వహించనున్నారు. అర్ధరాత్రి యువత రోడ్లపై తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడం..రెండు, మూడు సార్లు పట్టుబడితే తల్లిదండ్రులను పిలిచి మాట్లాడడం ఈ ఆపరేషన్ ఉద్దేశం. అయితే కొంతకాలంగా దీనిని నిర్వహించని పోలీసులు ఇప్పుడు మరోసారి ఈ ఆపరేషన్ ను నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా పాతబస్తీలో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టనున్నారు.

కొందరు యువత అర్దరాత్రి ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో ఎవరైనా కనిపిస్తే వారిపై దాడి చేయడం లాంటివి చేస్తారు. అంతేకాకుండా మాదక ద్రవ్యాలు సేవిస్తూ రోడ్లపై జల్సాలు చేస్తారు.

కొందరు పుట్టిన రోజు వేడుకల పేరుతో నడిరోడ్డుపై హంగామా చేస్తు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు. ఇలాంటి యువత వల్ల చాలా మంది ఇబ్బందులకు గురైన వారున్నారు. కొంతమంది ఫిర్యాదలు చేశారు. అయితే ఈ సమస్య పరిష్కారానికి పోలీసులు 'ఆపరేషన్ చబుత్ర' ను నిర్వహిస్తూ వస్తున్నారు.

అర్ధారాత్రి యువత ఎవరైనా రోడ్లపై కనిపిస్తే వారిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు. రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఉదయం కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. ఇలా రెండు మూడు సార్లు పట్టుబడితే వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తారు.

అయినా మారకపోతే ఆ తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొందరు అర్ధరాత్రి రోడ్లపై డిజేలు పెడుతూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ హంగామా గురించి ప్రశ్నిస్తే వారిపైనే దాడులు చేసిన సంఘటనలూ ఉన్నాయి. దీంతో పోలీసులు ఆపరేషన్ చబుత్ర పేరుతో యువతను సరైన దారిలో పెట్టాలని భావిస్తున్నారు.

అయితే గురువారం రాత్రి నుంచే ఈ కార్యక్రమాన్ని రిస్ట్రాట్ చేశారు. పాతబస్తీలోని పలు చోట్ల పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆపరేషన్ చబుత్రతో మంచి ఫలితాలు ఇచ్చిందని ఈ కార్యక్రమం నిర్వహించిన కొన్ని రోజుల వరకు యువత మళ్లీ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడలేదు. అయితే ఈమధ్య వీరి అరాచకాలు మల్లీ విపరీతమయ్యాయి. దీంతో కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా మల్లీ గురువారం నుంచి ప్రారంభించారు. అయితే ఈసారి ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.