Begin typing your search above and press return to search.

ఈ రోజు ఉదయం అమ్మకు ఆపరేషన్ చేశారా?

By:  Tupaki Desk   |   5 Dec 2016 7:14 AM GMT
ఈ రోజు ఉదయం అమ్మకు ఆపరేషన్ చేశారా?
X
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యానికి సంబంధించి వస్తున్న వార్తలు విపరీతమైన గందరగోళానికి గురి చేయటంతో పాటు.. ఉత్కంటకు గురి చేస్తున్నాయి. ఆమె ఆరోగ్యం గురించి బయటకు వస్తున్న వార్తలకు..విశ్వసనీయ వర్గాలు చెబుతున్న మాటలు సంబంధం లేకుండా ఉండటం గమనార్హం. ఒకపక్క పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెబుతూనే.. మరోవైపు.. భద్రతా పరమైన ఏర్పాట్లు భారీగా చేస్తున్న వైనం అందరిలో కొత్త కలవరాన్నిరేపుతోంది.

ఇదిలా ఉంటే.. అపోలో ఆసుపత్రులు విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో పేర్కొన్న అంశాలతో పాటు..తాజాగా వస్తున్న సమాచారం అమ్మ అభిమానులకు.. ఆమెను అమితంగా ఆరాధించే వారికి ఊరట కలిగించేలా ఉండటం గమనార్హం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అమ్మకు వచ్చింది గుండె పోటుకాదని.. కొద్దిసేపు గుండె ఆగిందని అపోలో ఆసుపత్రులు విడుదల చేసిన నోట్ లో ఉండటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సోమవారం ఉదయం ఆమెకు ఒక ఆపరేషన్ చేసినట్లుగా తెలుస్తోంది.

గుండె పోటుకు.. గుండె కాసేపు ఆగటానికి మధ్య చాలా తేడా ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. శరీరంలోని వివిధ భాగాలకు రక్త సరఫరాను గుండె ఆపేసినప్పుడు కార్డియక్ అరెస్ట్ వస్తుందని.. ఇలాంటి సమయాల్లో పేషుంట్ ఉన్నట్లుండి కుప్పకూలిపోతారని చెబుతున్నారు. అయితే.. ఇలాంటిది జరిగినప్పుడు వెనువెంటనే సరైన చికిత్స అందిస్తే కోలుకునే అవకాశాలుఉన్నాయి. చెస్ట్ వాల్ ద్వారా డీఫిబ్రిలేటర్ అనే పరికరంతో విద్యుత్ షాకులు ఇవ్వటం ద్వారా కొన్నిసార్లు సరిచేస్తారు.

కార్డిక్ అరెస్ట్ చోటు చేసుకున్నప్పుడు ఇలా జరిగితే.. గుండె పోటు వచ్చినప్పుడు మాత్రం జరిగే నష్టం భారీగా.. శాశ్వతంగా ఉంటుందని చెబుతున్నారు. గుండె నొప్పి అంటే గుండె కండరాలకు రక్తసరఫరా ఉన్నట్లుండి ఆటంకం కలగటం. దీని వల్ల గుండెకు తప్ప మిగిలిన శరీర భాగాలకు రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. కార్డిక్ అరెస్ట్ అయినా.. గుండె పోటు అయినా ప్రాణాంతకమే. కాకుంటే.. తక్షణ చికిత్స చేసినప్పుడు మాత్రం కొంత ప్రయోజనం ఉంటుందన్నది నిపుణుల మాట. అమ్మ ఇష్యూలో ఆమెకు వచ్చింది కార్డిక్ అరెస్ట్ మాత్రమే కానీ.. గుండె పోటు కాదు. మరి.. అమ్మ ఇప్పుడెలా ఉన్నారన్నది మాత్రం అంతుచిక్కనిదిగా మారిందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/