Begin typing your search above and press return to search.
ఆపరేషన్ కహుతా.. పాక్ అణు కేంద్రం ధ్వంసం కోసం భారత్-ఇజ్రాయెల్ ప్లాన్!
By: Tupaki Desk | 26 May 2021 8:00 AM ISTపాకిస్థాన్ లోని కహుతా అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ తో కలిసి భారతదేశం ఓ ప్రణాళిక రచించిందనే వార్తలు ఇప్పటికే ప్రచారం అవుతున్నాయి. వీటిపై స్పష్టమైన సమాచారం లేదు. పాలస్తీనా, ఇజ్రాయెల్ కాల్పుల అనంతరం పాక్ పట్ల భారత్ అలాగే వ్యవహించాలని నిపుణులు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. అందుకు గుజరాత్ ను కేంద్రంగా చేసుకోవాలని నిర్ణయించినట్లు పలువురు వెల్లడించారు. ఆ తర్వాత ఈ ప్రణాళిక ఎందుకు కార్యరూపం దాల్చలేదో? తెలుసుకుందామా?
ప్రత్యేక మిషన్
భారత్ లో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు స్వీకరించారు. 1977లో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. 1971 పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారతీయ నాయకులపై రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ నిఘా పెడుతోందని భావించారు. జనతా ప్రభుత్వం రా బడ్జెట్ లో 30 శాతం కోత విధించింది. పాకిస్థాన్ అణ్వాయుధ దేశంగా మారకుండా ఉండేందుకు ప్రత్యేక మిషన్ ను ఏర్పాటు చేసింది.
బ్లాప్రింట్ కు అవకాశం
కహుతా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బ్లూ ప్రింట్ ను భారతదేశానికి రూ.10,000 డాలర్లకు ఇవ్వడానికి ఓ రా ఏజెంట్ ముందుకొచ్చారని పాక్ గ్రూప్ కెప్టెన్ ఓ వ్యాసంలో పేర్కొన్నారు. విషయం తెలిసిన ప్రధాని మొరార్జీ దేశాయ్... పాక్ మిలిటరీ పాలకుడు జనరల్ జియా హుల్ హక్ ను ఫోన్ ద్వారా సంప్రదించారని చెప్పారు. కహుతా అణుబాంబు కేంద్రం నిర్మాణం గురించి ప్రస్తావించినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపారు. రా గూఢచారిని పట్టుకున్నారు. చివరకు భారత్ కు బ్లూప్రింట్ దక్కలేదని వెల్లడించారు.
తలవెంట్రులతో నిర్ధారణ
అణ్వాయుధాల ఉత్పత్తికి పాక్ కృషి చేస్తున్నట్లు రా అనుమానించింది. గూఢచర్యాన్ని అప్రమత్తం చేసింది. నెట్ వర్క్ ద్వారా చాలా సమాచారం సేకరించింది. ఇస్లామాబాద్ సమీపంలోని కహుతా దగ్గర న్యూక్లియర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు రా గుర్తించింది. దీనిని నిర్ధారించుకోవడానికి కహుతాలో పని చేస్తున్న శాస్త్రవేత్తల తలవెంట్రుకలపై ప్రయోగం చేసింది. సెలూన్లలో పరిశోధకుల వెంట్రుకల శాంపిల్స్ ను సేకరించింది. వారి వెంట్రుకల్లో కొన్ని పదార్థాల ద్వారా ఆయుధాల పనులు జరుగుతున్నట్లుగా ధ్రువీకరించింది. అనంతరం బ్లూప్రింట్ కోసం రహస్య మిషన్ ను ప్రారంభించారు.
రహస్య పర్యటన
అధికారంలోకి వచ్చిన ఇందిరా గాంధీ పాక్ లోని కహుతా అణ్యాయుధ కేంద్రాన్ని ధ్వంసం చేయాలని భావించారు. అందుకు నూతనంగా కొనుగోలు చేసిన జగౌర్ ఎయిర్ క్రాఫ్ట్ ను రంగంలోకి దించాలని ప్రణాళిక రచించిందని ఓ పుస్తకంలో ప్రస్తావించారు. 1983లో భారతీయ సైనికాధికారులు ఇజ్రాయెల్ లో రహస్యంగా పర్యటించారు. అణు కేంద్రాన్ని ధ్వంసం చేసే సాంకేతికతపై అధ్యయనం చేసినట్లు కొందరు అనుమానించారు. పాక్ దగ్గర ఉన్న ఫైటర్ జెట్ల గురించి భారత్ కు ఇజ్రాయెల్ సమాచారం అందించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కు అవసరమైన ఐఎంజి-23 ఎయిర్ క్రాఫ్ట్ కు కు ఇండియా రహస్య సమాచారాన్ని ఇచ్చింది.
పక్కా ప్రణాళిక
'ఈ మిషన్ పూర్తి చేయడం కోసం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఆ దేశంలోని హైఫా నుంచి భారత్ లోని జామ్ నగర్ చేరుతుంది. అక్కడ నుంచి అవసరమైన పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రితో జమ్ము కశ్మీర్ లోని ఉదంపూర్ చేరుకుంటాయి. అక్కడి నుంచి ఎవరికీ కనపడకుండా విమాన శ్రేణులు పర్వతాల్లో ఎగురుతాయి. అవి బయటకు కనిపించేలోపే రెండు విమానాలు అణు కేంద్రాన్ని పేల్చుతాయి. అనంతరం దక్షిణ వైపు నుంచి తక్కువ ఎత్తులో ఎగురుతూ స్వదేశం చేరుకుంటాయని ఓ పక్కా ప్లాన్ రచించినట్లు' సీనియర్ భద్రతా నిపుణులు వివరించారు.
చివరకు
కహుతా అణు కేంద్రం ధ్వంసం కోసం ఇజ్రాయెల్ మూడుసార్లు భారత్ ను సంప్రదించిందని ఓ వ్యాసంలో ప్రస్తావించారు. పాక్ లో అణుబాంబులు ఉత్పత్తి అయితే అవి ఇరాన్, ఇరాక్ కు సరఫరా అవుతాయని ఇజ్రాయెల్ భావించింది. అందుకే ఈ మిషన్ పట్ల ఆసక్తి కనబర్చిందని కొందరు నిపుణులు చెప్పారు. భారత్ వైమానిక దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థ పాక్ కు సమాచారం చేరవేసింది. ఈ విషయాన్ని టీవీల్లో ప్రసారం చేశారు. భారత్ పై పశ్చిమ దేశాల ఒత్తడితో ప్రధాని ఇందిరా ఈ ప్లాన్ ను రద్దు చేశారు. ఆ తర్వాత అణు కేంద్రాలపై దాడులను నిషేధిస్తూ భారత్, పాక్ తీర్మానించుకున్నాయి.