Begin typing your search above and press return to search.

ఉప్పు-నిప్పు లాక్ డౌన్ వేళ కలిశారు..

By:  Tupaki Desk   |   31 March 2020 11:00 PM IST
ఉప్పు-నిప్పు లాక్ డౌన్ వేళ కలిశారు..
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ గెలుపోటములతో వైరివర్గాలుగా మారిన ఇద్దరు గులాబీ నేతలు ఈ లాక్ డౌన్ వేళ కలిసిన దృశ్యం కనిపించింది. ఒకరేమో టీఆర్ఎస్ నుంచి ఓడినవారు.. రెండో వ్యక్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి గులాబీ పార్టీలో చేరారు. వీరే సీనియర్ నేత మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. ఈయనపై గెలిచిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.

ఇన్నాళ్లు ఇద్దరూ ఉప్పునిప్పులా ఉన్నారు. ఇప్పుడు అనూహ్యంగా కరోనా కోసం కలిసిపోయారు. నియోజకవర్గంలో వారిద్దరి మధ్య నడిచిన వార్ ముగిసింది. ప్రజలకు సేవ చేసేందుకు వీరిద్దరూ కలిశారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ముందుకెళ్తున్నారు. కరోనా నివారణలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి ప్రజాప్రతినిధులందరూ కలిసి పనిచేయాలని సూచించారు. దీంతో పాటు ఉచిత బియ్యం, నగదు ప్రజాప్రతినిధులు పంపిణీచేయాలని సూచించారు.

దీంతో ఇటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు.