Begin typing your search above and press return to search.
ప్రతిపక్షాలది..అధికార పక్షానిది ఒకటే మాటయింది
By: Tupaki Desk | 4 Aug 2015 3:59 AM GMTరాజధాని నిర్మాణానికి ఎంత భూమి అవసరం అనే విషయంలో నవ్యాంధ్రలో ప్రతిపక్షాల మాటకు, అధికార పక్షం మాటకు చివరికి ఒకటే అయింది. రాజధాని నిర్మాణానికి ఏడు వేల ఎకరాలు చాలని ప్రతిపక్షాలు పదే పదే చెప్పాయి. ఇప్పుడు రాజధానిలో ప్రభుత్వానికి మిగిలేది కూడా 7240 ఎకరాలు మాత్రమే.
అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి ప్రభుత్వం 32 వేల ఎకరాలను సేకరించింది. మరో 18 వేల ఎకరాలను ప్రభుత్వ భూములు, అటవీ భూములను సేకరిస్తోంది. మొత్తంమీద దాదాపు 50 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి తీసుకుంటోంది. ఇందులో డెవలప్మెంట్ కింద 50 శాతం భూమిని తీసేయాల్సి ఉంది. దీనిని తీసేస్తే మిగిలేది 25 వేల ఎకరాలు. ఇందులో రైతులకు దాదాపు 9000 ఎకరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అది కాస్తా ఇచ్చేస్తే రైతులకు మిగిలేది 16 వేల ఎకరాలు. ఇందులో అమరావతిని నిర్మించే సింగపూర్ కు 3000 ఎకరాలు.. జపాన్ కు మరో 3000 ఎకరాలను ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇక మిగిలేది మరో పది వేల ఎకరాలు. ఇక, పార్కులు, విద్యాలయాలు, ఆస్పత్రులు వంటి సామాజిక అవసరాలకు కేటాయించిన భూమిని తీసేస్తే ప్రభుత్వానికి మిగిలేది కేవలం ఏడు వేల ఎకరాలు మాత్రమే. తద్వారా ప్రతిపక్షాలు ఎంత భూమి అవసరమని చెప్పాయో ప్రభుత్వానికి కూడా చివరికి అంతే మిగిలింది. అయితే, ప్రభుత్వం కనక 50 వేల ఎకరాలను సేకరించకపోయి ఉంటే.. రోడ్లు ఎక్కడ వస్తాయి? మౌలిక సదుపాయాలు ఎక్కడ వస్తాయి? అసలు రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వంలోని వివిధ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.