Begin typing your search above and press return to search.
మోడీ శిష్యుడికి మర్యాద తెలీదా !!
By: Tupaki Desk | 10 Nov 2015 7:03 AM GMTఅధికారంతో వచ్చిన అహంభావం మంచిది కాదని.. మర్యాదగా ఉండటం చాలా అవసరమంటూ బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మోడీ అండ్ కో మీద పలువురు విమర్శలు కురిపించటం తెలిసిందే. తాజాగా చోటు చేసుకున్న పరిణామం మోడీ అండ్ కో మీద మరింత విమర్శలు సంధించేలా ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో రగులుకున్న తాజా వివాదంలో ప్రధాన పాత్ర ప్రధాని మోడీ శిష్యుడిగా చెప్పుకునే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కారణంగా ఉండటం గమనార్హం.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఒకప్పుడు లండన్ లో నివసించిన ఇంటిని మహారాష్ట్ర సర్కారు కొనుగోలు చేయటం తెలిసిందే. ఆ భవనాన్ని అంబేడ్కర్ స్మారక భవనంగా మార్చి లండన్ లో ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్ర సర్కారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మరికొందరు ఉన్నారు. ఆసక్తికరంగా ఈ కార్యక్రమానికి హాజరువుతున్న వారిలో విపక్షాలకు చెందిన వారు ఒక్కరు కూడా ఉండకపోవటం విశేషం. ఒకవేళ.. మహారాష్ట్ర సర్కారు ఆహ్వానం పంపినా.. విపక్షాలు రాలేదేమో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఈ కార్యక్రమానికి సంబంధించి తమకు ఆహ్వానం కూడా అందలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు అంటే మరీ అంత చులకనా? అని మహారాష్ట్ర విపక్షాలు మండిపడుతున్నాయి.
మరోవైపు.. దీనికి మహారాష్ట్ర సర్కారు బదులిస్తూ.. ఇందులో తమ తప్పు ఏం లేదని.. ఈ కార్యక్రమాన్ని లండన్ అధికారులు నిర్వహిస్తున్నారని.. చాలా తక్కువ మందికి ఆహ్వానాలు పంపుతున్నారంటూ సర్ది చెబుతున్నారు. అయితే.. మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు కామెడీగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ కార్యక్రమాన్ని లండన్ అధికారులు నిర్వహిస్తున్నప్పటికీ.. వారికి.. మన ప్రోటోకాల్ వివరించి.. విపక్ష నేతల్ని కూడా పిలవాలని చెబితే.. లండన్ అధికారులు కాదంటారా ఏమిటి? వరుస అపజయాలు ఎదురవుతున్నా.. అందరిని కలుపుకోవాలన్న విషయంపై కమలనాథులు ఇప్పటికి కళ్లు తెరవకపోవటం సరికాదన్న వాదన వినిపిస్తోంది.