Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌పై ప‌వ‌న్ విమ‌ర్శ‌నాస్త్రాలు.. ఇప్పుడే ఎందుకంటే!

By:  Tupaki Desk   |   30 Dec 2020 4:30 PM GMT
జ‌గ‌న్‌పై ప‌వ‌న్ విమ‌ర్శ‌నాస్త్రాలు.. ఇప్పుడే ఎందుకంటే!
X
రాష్ట్ర రాజ‌కీయాల్లో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నా యి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా.. అంటే.. ఏడాదిన్న‌ర త‌ర్వాత‌.. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా లోకేష్ ప్ర‌జాక్షేత్రంలోకి దిగిపోయారు. మ‌రోవైపు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అనూహ్యంగా పొలిటి క‌ల్ టూర్ చేస్తున్నారు. కీల‌క‌మైన మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. ఇక‌, య‌థాలాపంగా సీఎం జ‌గ‌న్‌ను కూడా విమ‌ర్శిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ఏకంగా.. జ‌గ‌న్‌ను ఉద్దేశించి మ‌త రాజ‌కీయాల‌పైనా కామెంట్లు చేశారు.

అయితే.. ఇప్పుడే ఎందుకు ఇలా ముప్పేట దాడి జ‌రుగుతోంది. అందునా.. ఎన్నిక‌ల అనంత‌రం.. రాష్ట్రం లో పెద్ద‌గా ప‌ర్య‌టించ‌ని.. దాదాపు ట్విట్ట‌ర్‌కే ప‌రిమిత‌మ‌వుతున్న ప‌వ‌న్‌.. హ‌ఠాత్తుగా ఎందుకు గుడివాడ‌లో ప‌ర్య‌టించిన‌ట్టు..? ఏరికోరి.. కొడాలి నానినే ఎందుకు టార్గెట్ చేసిన‌ట్టు.. ఇప్పుడు జ‌గ‌న్ పై ప‌ర‌మ‌త స‌హ ‌నం కూడా చూపించండి! అంటూ కామెంట్లు ఎందుకు కుమ్మ‌రించిన‌ట్టు? అదేస‌మ‌యంలో లోకేష్ కూడా పొలాల్లోకి దిగి మ‌రీ రైతుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు? నివ‌ర్ తుఫాను వ‌చ్చి వెళ్లిపోయిన త‌ర్వాత ఇప్పుడు ప‌రామ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు? ఇదంతా ఎందుకు జ‌రుగుతోంది?

అంటే... రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఇప్పుడు ఏపీ లో జ‌రుగుతున్న కీల‌క కార్య‌క్ర‌మం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. ఒకేసారి 30 ల‌క్ష‌ల మంది(కొర్టు కేసుల‌తో కొన్ని మిన‌హా) పేదల‌కు ఇళ్ల‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని జోరుగా హోరుగా నిర్వ‌హిస్తున్నారు. ల‌బ్ధిదారుల‌కు నేరుగా ప‌ట్టాల‌ను అందిస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వంపై భారీ ఎత్తున సానుభూతి ప‌వ‌నాల‌తో పాటు.. గ‌త పాల‌కుల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కూడా కురుస్తోంది. పేద‌లు ఇప్పుడు వైసీపీ మాట‌ను, బాట‌ను ప‌ట్టుకున్నారు. దీంతో ఈ హ‌డావుడి నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు.. టీడీపీ, జ‌న‌సేన‌లు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని.. అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. అయితే.. ఇలాంటి ఎత్తుగ‌డ‌ల‌తోనే గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ విఫ‌లమ‌య్యార‌ని, టీడీపీ ఘోరంగా దెబ్బతింద‌ని చెబుతున్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్న విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.