Begin typing your search above and press return to search.
తెలంగాణలో కూర్చొని ఆంధ్రా రాజకీయాలేంటో?
By: Tupaki Desk | 14 Jun 2016 7:08 AM GMTరెండు రాష్ట్రాలుగా తెలుగు ప్రాంతం విడిపోయిన తర్వాత.. ఒక ప్రాంతంలో ఉండే వారు మరో ప్రాంతానికి సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడటం ఏపీకి మాత్రమే పరిమితం అవుతుందేమో? తెలంగాణలోని ఉద్యమం గురించి.. తెలంగాణకు చెందిన నేతలు ఆంధ్రాలో కూర్చొని సమాలోచనలు చేయటం.. ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టటం ఏమిటో వారికే తెలియాలి. ఉండేది హైదరాబాద్ లో కానీ.. వారి నోటి వెంట వచ్చేది మాత్రం ఏపీ రాజకీయాలు కావటం గమనార్హం.
నిన్నటికి నిన్న జరిగిన కాపు నేతల సమావేశాన్నే తీసుకోండి.ఈ సమావేశానికి భిన్నధ్రువాలైన దాసరి నారాయణరావు.. చిరంజీవిలతో పాటు.. పల్లంరాజు.. బొత్స సత్యనారాయణ మొదలుకొని పలువురు కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు హాజరు కావటం గమనార్హం. ఇంతకీ వారు మాట్లాడుకున్నదంతా ఎవరి గురించి అంటే.. రాజమండ్రి ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం గురించి . నిజంగానే ఏపీలోని కాపుల మీద నేతలకు ప్రేమాభిమానాలు ఉంటే.. ఏపీకి వచ్చి సమావేశాల్ని ఏర్పాటు చేయొచ్చుగా? రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పుకోవచ్చు కానీ.. ఏపీ సర్కారే హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ఉద్యమ నేతలు వేరే రాష్ట్రం నుంచి రాజకీయం చేయటం సరి కాదన్న భావన వ్యక్తమవుతోంది.
రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉండి.. వేరే రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయటం.. అక్కడి ప్రజల్లో భావోద్వేగాల్ని టచ్ చేయటం సరకాదన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ వాదనలో నిజం ఎంతన్నది ఆయా నేతలకే తెలియాలి. ఏది ఏమైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాల్ని ఆ రాష్ట్రం నుంచి చేస్తేనే బాగుంటుందేమో?