Begin typing your search above and press return to search.

మోడీకి దిమ్మ తిరిగే ప్లాన్ ను రెఢీ చేసిన విప‌క్షాలు!

By:  Tupaki Desk   |   13 Feb 2019 5:01 AM GMT
మోడీకి దిమ్మ తిరిగే ప్లాన్ ను రెఢీ చేసిన విప‌క్షాలు!
X
త్వ‌ర‌లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంగ‌తేమో కానీ.. ఇప్ప‌టికైతే రాజ‌కీయ వాతావ‌ర‌ణం పూర్తిగా మారింది. వేస‌వి ఇంకా మొద‌లు కాన‌ప్ప‌టికీ.. రాజ‌కీయం మాత్రం సెగ‌లు పొగ‌లు క‌క్కుతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఈసారి తీవ్ర‌స్థాయిలో జ‌రగ‌టం ఖాయ‌మ‌న్న సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధాని మోడీ తీరును నిర‌సిస్తున్న విపక్షాలు.. ఆయ‌న‌కు దిమ్మ తిరిగేలాంటి ఒక ప్లాన్ ను సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

దాదాపు 30 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ చేసిన ప‌నినే..తాజాగా విప‌క్షాలు ఫాలో కానున్న‌ట్లుగా తెలుస్తోంది. బోఫోర్సు స్కాంలో ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు రాజీవ్ గాంధీ నో చెప్పారు. జేపీసీకి నిరాకరించారు. దీంతో.. ఎన్టీఆర్ నేతృత్వంలోని అప్ప‌టి నేష‌న‌ల్ ఫ్రంట్ ఊహించ‌ని నిర‌స‌న‌కు దిగింది.

ఏకంగా 12 ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన 108 మంది ఎంపీలు రాజీనామా చేశారు. దాంతో లోక్ స‌భ సంక్షోభంలో ప‌డింది. ప్ర‌స్తుత పార్ల‌మెంటు స‌మావేశాల ఆఖ‌ర్లో మోడీకి దిమ్మ తిరిగేలా షాకిచ్చేందుకు విప‌క్ష ఎంపీలంతా రాజీనామా చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

రాఫెల్ కుంభ‌కోణంపై సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీని నియ‌మించాల‌న్న విప‌క్షాల డిమాండ్‌ను మోడీ స‌ర్కారు నో చెప్ప‌టం.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు సానుకూలంగా లేని నేప‌థ్యంలో.. మోడీ తీరును నిర‌సిస్తూ విపక్ష ఎంపీలంతా క‌లిసి త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ప్ర‌ధాని మోడీపై సంధించే త‌మ ఆఖ‌రి అస్త్రంగా మూకుమ్మ‌డి రాజీనామాల్ని చెబుతున్నారు. తాజా ప్ర‌తిపాద‌నను ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ప్లాన్ ను ఇప్ప‌టికే కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాజీవ్ గాంధీతో పాటు.. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌.. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత మ‌మ‌తా బెన‌ర్జీ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.

దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంద‌ని.. ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్న దానిపై స్ప‌ష్ట‌త రావ‌టం లేదు. ఎన్టీఆర్ హ‌యాంలో 106 మంది ఎంపీలు రాజీనామా చేస్తే.. ఈసారి అప్ప‌టి కంటే ఎక్కువ‌మంది ఎంపీలు (సుమారు 120 వ‌ర‌కు) రాజీనామా చేయాల‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు మాట‌ల‌కు విప‌క్షాలు ఎంత వ‌ర‌కు ఓకే చెబుతాయ‌న్న‌ది చూడాలి.