Begin typing your search above and press return to search.
మీరే ముఖ్యమంత్రిగా ఉంటారా.. ప్రతిపక్ష నేత ఆరా!
By: Tupaki Desk | 20 March 2020 5:00 PM GMTకర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రతిపక్షానికి లోకువ అయినట్టుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలోని పరిణామాల విషయంలో వారు ఎద్దేవా చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. డైరెక్టుగా ముఖ్యమంత్రి యడియూరప్పను ఉద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లూ మీరే ముఖ్యమంత్రిగా ఉంటారా? అంటూ సీఎల్పీ నేత సిద్ధరామయ్య ప్రశ్నించడం గమనార్హం. తమకు సందేహాలు వస్తున్నాయంటూ సిద్ధూ వ్యాఖ్యానించారు.
భారతీయ జనతా పార్టీలో పరిణామాలు సందేహాలకు తావిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. యడియూరప్పను కట్టడి చేసేందుకు బీజేపీ అధిష్టానం మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే డిప్యూటీ ముఖ్యమంత్రులను నియమించడం, ఆ పై మంత్రి వర్గం ఎంపికలో కూడా ఆయనకు బీజేపీ అధిష్టానం పెద్దగా స్వాతంత్రం ఇవ్వలేదనే వార్తలూ వచ్చాయి.
ఇప్పుడు కూడా యడియూరప్ప ఇష్ట ప్రకారం ఏం జరగడం లేదని, అంతా అధిష్టానం కనుసన్నల్లోనే సాగుతూ ఉందనే టాక్ ఉంది. అంతే కాదు... ముఖ్యమంత్రిని మారుస్తారనే ప్రచారానికీ లోటు లేదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎప్పుడు, ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తారో చెప్పడం కష్టం అనే అభిప్రాయాలు ఉండేవి. కుర్చీలో ఉన్న సీఎంల గురించి తరచూ మారుస్తారనే ఊహాగానాలు వినిపించేవి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆ పరిస్థితి మొదలైనట్టుగా ఉంది.
పేరుకు యడియూరప్ప సీఎం అయినప్పటికీ.. ఆయనను మారుస్తారు, ఆయన మాట చెల్లడం లేదు.. అనే అభిప్రాయాలే తరచూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లూ మీరే సీఎంగా ఉంటారా.. అంటూ కాంగ్రెస్ నేతలు యడియూరప్పను ఉద్దేశించి వ్యంగ్యంగా ప్రశ్నించేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం యడియూరప్ప దగ్గర కూడా లేదేమో అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.