Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా కిట్లపై అవినీతి ఆరోపణలు!

By:  Tupaki Desk   |   19 April 2020 7:51 AM GMT
ఏపీలో కరోనా కిట్లపై అవినీతి ఆరోపణలు!
X
దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఏపీ సీఎం జగన్ కరోనా విషయంలో ఎంతో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కరోనాను నియంత్రించి 10 నిమిషాల్లోనే వ్యాధి నిర్ధారణ చేసే పరికరాలు తయారు చేసిన దక్షిణ కొరియా దేశంతో ఏపీ ప్రభుత్వం తాజాగా సంప్రదింపులు జరిపి కరోనా టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసింది. ఇటీవలే కొరియా నుంచి ప్రత్యేక విమానంలో భారీగా కరోనా టెస్ట్ కిట్లను ఏపీలోని గన్నవరానికి తీసుకువచ్చారు. ఈ కిట్స్ తో వేగంగా కరోనా టెస్టులు చేస్తూ వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్సలు అందిస్తున్నారు.

పక్కనున్న తెలంగాణలో కూడా ఇంత వేగంగా పరీక్షలు జరగడం లేదు. దేశంలోనే సీఎం జగన్ తీసుకున్న చొరవపై అభినందనలు కురుస్తున్నాయి. కరోనాను నియంత్రించడంలో సీఎం జగన్ ముందుచూపుతో కరోనాను కట్టడి చేస్తున్నారంటున్నారు

అయితే నాణేనికి మరోవైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏపీలో కరోనా నుంచి తెప్పించిన టెస్టింగ్ కిట్లపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఒక్కో కిట్ తో రూ.700 రూపాయల అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.అదే కొరియా నుంచి చత్తీస్ ఘడ్ రాష్ట్రం ఒక్కో కిట్ ను రూ.337కే తెప్పించుకుందని.. ఏపీ మాత్రం రూ.1200 పెట్టి ఎందుకు కొనుగోలు చేసిందని ప్రశ్నిస్తున్నారు.

ఇంతటి కరోనా వ్యాధి విస్తృతి వేళ దక్షిణ కొరియా నుంచి మనమే కాదు.. అమెరికా, ఇతర దేశాలు కూడా ఈ టెస్ట్ కిట్స్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. అమ్మేవాడి డిమాండ్ ను బట్టి ధర పెరుగుతూ పోతోంది. ఈ కనీస అవగాహన లేకుండా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడం అర్థరహితంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా కిట్స్ డిమాండ్ దృష్ట్యానే జగన్ ప్రభుత్వం ప్రజల ప్రాణాల కోసం ఎంతో వెచ్చించి ఒప్పించి కిట్స్ తీసుకొచ్చింది. ధర భారీగా పెట్టి అయినా తీసుకొచ్చి మంచిగా కరోనా పరీక్షలు చేస్తూ చర్యలు తీసుకుంటోంది. అయితే ఇందులోనూ ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడం శోచనీయమని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.