Begin typing your search above and press return to search.
కేసీఆర్ మెడలు వంచినట్లేనా?
By: Tupaki Desk | 27 Jun 2016 9:28 AM GMTతెలంగాణ నేతల నోటి నుంచి తరచూ ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. తమ ప్రత్యర్థులపై నోరు పారేసుకునే క్రమంలో.. తాము చేస్తున్న వాదనకు తగ్గట్లుగా అవతలి వారిని మారుస్తామనే మాటకు.. మెడలు వంచేలా చేస్తాం.. అనుకున్నది సాధిస్తామంటూ చెబుతుంటారు. నిజానికి ఈ మాట కేసీఆర్ ది. ఆయన తరచూ ‘మెడలు వంచే మాట’ను ప్రయోగిస్తుంటారు. ఉద్యమ కాలంలో తరచూ ఆయన నోటి నుంచి రావటం.. ఈ మాట పవర్ ఫుల్ గా ఉండటంతో మిగిలిన వారు సైతం అవసరానికి తగ్గట్లుగా ఆ మాటను వాడటం ఒక అలవాటుగా మారింది.
తాజాగా మల్లన్న సాగర్ వ్యవహారంపై తెలంగాణ అధికారపక్షంపై విపక్షాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కారణంగా పెద్ద ఎత్తున నిర్వాసితులయ్యే రైతులకు ఇస్తామని చెబుతున్న పరిహారం తూతూ మంత్రంగా ఉందని.. దాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేయటం తెలిసిందే. కేసీఆర్ సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తున్న వేళ.. ఈ అంశంపై దీక్ష చేపట్టాలని తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆయన దీక్ష రెండోరోజు చేరుకునే సమయానికే ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా పరిహారం చెల్లిస్తామని.. ఆ విషయాన్ని రైతులకే వదిలిపెడుతున్నట్లుగా ఆయన తేల్చి చెప్పారు. విపక్షాల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరక ముందే కేసీఆర్ ముందే రియాక్ట్ అయ్యారు. విపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. రైతుల పరిహారం విషయంలో కేసీఆర్ అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారని ఊహించని విపక్షాలు నోట మాట రాని పరిస్థితి.
అలా అని ఊరుకుంటే బాగోదు కాబట్టి.. విపక్షాలు కొత్త పల్లవి మొదలెట్టాయి. తాము కేసీఆర్ మెడలు వంచామని.. తమ విమర్శలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయ్యారని.. తాము చేపట్టిన ఆందోళనలతో టీఆర్ ఎస్ సర్కారు వెనక్కి తగ్గి మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు భారీ ప్రయోజనం కలిగిందన్న వాదనను షురూ చేశారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్ తనదైన ప్రకటన విడుదల చేసి ఊరుకుండిపోతే.. విపక్షాలు మాత్రం క్రెడిట్ లెక్కల్లోకి దిగాయి. మొండితనానికి నిలువెత్తు రూపమైన కేసీఆర్ లాంటి అధినేత ఎంతకైనా సిద్ధమే అని అనుకొని ఉంటే విపక్షాల మాట అస్సలు వినరని తెలిసిందే. నిర్వాసితుల విషయంలో కఠినంగా వ్యవహరించటం లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకోవటమన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రకటన చేశారని చెప్పొచ్చు. నిజం ఇలా ఉంటే.. దాన్ని తమకు తగ్గట్లుగా మార్చుకొని కేసీఆర్ మెడలు వంచినట్లుగా ప్రచారం చేసుకోవటం తెలంగాణ విపక్షాలకే చెల్లుతుంది. విపక్షాల వంచుడుకే వంగిపోయే మెడలా కేసీఆర్ వి..?