Begin typing your search above and press return to search.
దేశ బంద్‌కు ప్రతిపక్షాల స్కెచ్
By: Tupaki Desk | 22 Nov 2016 6:42 AM GMTపెద్ద నోట్ల రద్దు విషయంలో పార్లమెంటులోనూ - పార్లమెంటు వెలుపల గట్టి ఐక్యతతో ఉన్న ప్రతిపక్షాలు.. రానున్న రోజుల్లో ప్రజల వద్దకు వెళ్లాలని భావిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు.. దాని పర్యవసనాలు - డబ్బు అందుబాటులో లేక.. ఉన్న పెద్ద నోట్లు చెల్లక ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో బంద్ కు పిలుపునివ్వాలన్న యోచనలో ప్రతిపక్షాలు ఉన్నాయి. ప్రత్యేకించి గ్రామీణవాసులు ఎదుర్కొన్నటున్న కష్టాల నేపథ్యంలో దేశవ్యాప్త సమ్మె లేదా బంద్‌కు పిలుపునిచ్చే ఉద్దేశంతో ఉన్నాయి. డిసెంబర్ వేతనాలు చెల్లించిన అనంతరం ఈ నిరసనకు పిలుపునిస్తారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి జైట్లీతో ప్రధాని మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలాఉండగా పెద్ద నోట్ల రద్దుపై యావత్ విపక్షం విరుచుకు పడ్తున్నా బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం ప్రధాని మోదీకి బాసటగా నిలిచారు. మోదీ చర్య వల్ల ఆయన మిత్రపక్షాలకు నష్టం చేకూరే అవకాశముందన్నారు. కానీ మోదీ చర్యకు అనుకూలంగా గొప్ప సానుకూల అంశాలున్నాయని, కనుక ఆయనను గౌరవించాలని జేడీయూ నేతలకు నితీశ్ సలహా ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పులిమీద స్వారీ వంటిదేనన్నారు. మరోవైపు పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో రచ్చ రచ్చ కొనసాగుతోంది. సభలో ఓటింగ్ కు వీలు కలిగే విధంగా 56వ నిబంధన కింద చర్చ జరుగాలని, ప్రధానమంత్రి సభకు రావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని జపాన్ నుంచి గోవా వరకు తిరుగుతూ నోట్ల రద్దు గురించి మాట్లాడుతున్నారు కానీ, పార్లమెంటుకు రావడానికి ఎందుకు జంకుతున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అధికార పక్షం మాత్రం 193 నిబంధన కింద చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ, చర్చ నుంచి పారిపోతున్నాయని ప్రతిపక్షాలనే విమర్శిస్తున్నది. నోట్ల రద్దు చర్చ విషయమై ఉభయసభల్లో కూడా గందరగోళం కొనసాగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/