Begin typing your search above and press return to search.
ఆర్మీ రూల్స్ ను లైట్ తీసుకున్న వ్యక్తికి దేశరక్షణలో అత్యున్నత పదవి
By: Tupaki Desk | 30 Dec 2019 1:27 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్) పదవికి సైనిక దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ ను ఎంపిక చేశారు. అయితే, ఆర్మీ రూల్స్ ను లైట్ తీసుకున్న వ్యక్తికి...త్రివిధ దళాల అధిపతి పదవి అప్పగించారని పలువురు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను ఉద్దేశించి సైనిక దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న తరుణంలోనే...ఆయనకు ముఖ్యమైన పదవి ఇవ్వడం గమనార్హం.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల గురించి రావత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రజలను తప్పుదోవ పట్టించేవారు ఎప్పటికి నాయకులు కాలేరు’ ‘మన నగరాల్లో - పట్టణాల్లో ప్రజలు విధ్వంసకాండకు పాల్పడేలా కళాశాలలు - యూనివర్శిటీల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. అది ఎప్పటికీ నాయకత్వం అనిపించుకోదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విమర్శలు అలా ఉంచితే...ఈ విధంగా రాజకీయాలకు సంబంధించి ఓ సైనికాధికారి వ్యాఖ్యలు చేయడం సైనిక సర్వీసు నిబంధనలకు పూర్తి విరుద్ధం. సైనిక సర్వీసు నిబంధనల్లోని 21వ నిబంధన ప్రకారం ‘ఓ రాజకీయ పార్టీ నిర్వహించే ఎలాంటి ప్రదర్శనల్లో కూడా సైనికులు పాల్గొనకూడదు. అలాగే ప్రత్యక్షంగాగానీ - పరోక్షంగాగానీ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలను చేయరాదు’. సైనికులు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల పాకిస్తాన్ తరహాలో ప్రజాస్వామ్య వ్యవస్థ కూలిపోయి సైనిక నియంత్రణ పాలన వచ్చే ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతోనే భారత సైనిక సర్వీసు రూల్స్ లో ఈ నిబంధనను చేర్చారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా సైనిక సర్వీసు రూల్స్ తెలియజేస్తున్నాయి.
అయితే, సైనిక అత్యున్నత అధికారే నిబంధనలు ఉల్లంఘిస్తే చర్య తీసుకునే అంశం అలా పక్కనపెట్టి...ఆయనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి కేటాయించడం గమనార్హం. అందుకే రావత్ కామెంట్లను - నిబంధనలను ఉల్లంఘించిన తీరును ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.