Begin typing your search above and press return to search.
మోడీ దెబ్బకు ఇమ్రాన్ కు స్వదేశంలో కొత్త తలనొప్పులు
By: Tupaki Desk | 28 Aug 2019 6:23 AM GMTజమ్ముకశ్మీర్ అంశంలో ప్రధాని మోడీ తీసుకున్నసాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు ఆ దేశంలో కొత్త చిచ్చును రేపింది. ఇంట్లో ఎలుకల మోతను బయటపడకుండా ఉండేందుకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ పడుతున్న ప్రయాస అంతా ఇంతా కాదు. అందుకే ఎప్పుడూ లేని రీతిలో అణుయుద్ధం గురించి కూడా మాట్లాడేస్తున్నారు. బుర్ర.. బుద్ధి ఉన్నోడు ఎవరూ ప్రస్తావించని అణుయుద్ధం గురించి అదే పనిగా ఇమ్రాన్ మాట్లాడటం వెనుక అసలు విషయం.. పాక్ లో తాను ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితి మీద పెద్దగా ఫోకస్ కాకూడదనే.
దీంతో నోటికి పని చెబుతున్నారు ఇమ్రాన్ ఖాన్. ఇదిలా ఉంటే.. తాజాగా పాక్ లోని ప్రతిపక్షాలు ఇమ్రాన్ ను తెగ దునుమాడేస్తున్నాయి. జమ్ముకశ్మీర్ కు ఆర్టికల్ 370 నిర్వీర్యం చేయటం ద్వారా మోడీ మాస్టర్ స్ట్రోక్ పై అక్కడి విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో ఇమ్రాన్ ప్రభుత్వ సమర్థను ప్రశ్నించారు.
గతంలో పాక్.. శ్రీనగర్ ను స్వాధీనం చేసుకోవటం గురించి మాట్లాడేదని.. ఇప్పుడు ముజఫరాబాద్ (పాక్ అక్రమిత కశ్మీర్ రాజధాని) ను కాపాడుకోవటమే గొప్పని ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ ఖాన్ అనుసరిస్తున్నబలహీనమైన విధానాల మీదా ఆయన మండిపడుతున్నారు. కశ్మీర్ పై మోడీ తీసుకున్న నిర్ణయంతో.. పాక్ డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితి. కశ్మీర్ మీద రాజకీయం చేస్తూ ప్రయోజనాలు పొందే పాక్ అధికారపక్షానికి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. గతంలో కశ్మీర్ గురించి పాక్ ప్రస్తావించిన ప్రతిసారీ.. దాని మీద స్పందించేందుకు అప్పటి భారత ప్రభుత్వాలు కిందామీదా పడుతుంటే.. ఇప్పుడు ఏకంగా పాక్ అక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో.. పాక్ పరిస్థితి ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయి.. తాము ఆక్రమించిన కశ్మీర్ మీద కొత్త బెంగ మొదలైన పరిస్థితిగా చెప్పక తప్పదు.