Begin typing your search above and press return to search.
కోర్టులతో కేసీఆర్ ను భయపెడుతున్నారే..
By: Tupaki Desk | 14 July 2018 5:06 AM GMTసంస్కరణలు చేయాలంటే దమ్ము - ధైర్యం ఉండాలి. అవన్నీ పుష్కలంగా ఉన్న కేసీఆర్ గడిచిన నాలుగేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అయితే ఆయనకు అవరోధాలు లేకపోలేదు. మార్పులు చేసిన ప్రతిసారి కోర్టుకెళ్లడం.. వాటిని అడ్డుకోవడం షరామామూలుగా అయిపోయింది. అంతో ఇంతో మార్పు తెద్దామన్న ఆయన ఆశలపై ఈ మధ్య నీళ్లు చల్లుతున్నారు. అయితే కేసీఆర్ ఏకపక్షంగా మొండి వైఖరి వల్లే ఇదంతా జరుగుతోందని ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నాయి.
2019 ఎన్నికలకు ముందే జనాల అభిప్రాయం తెలుసుకోవాలని కేసీఆర్ పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లారు. మహారాష్ట్ర నుంచి కావలసిన బ్యాలెట్ బాక్స్ లు తెప్పించి గ్రామాలకు పంచారు. ఇక రేపో మాపో నోటిఫికేషన్ వేద్దామనుకునే లోపే కాంగ్రెస్ నేతలు హైకోర్టుకెళ్లారు. బీసీల గణనను సరిగా చేయలేదని మెలిక పెట్టారు. మళ్లీ చేయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. హైకోర్టు ఎన్నికలను వాయిదా వేసి ప్రభుత్వానికి బీసీ గణనపై ఆదేశాలిచ్చింది..దీంతో కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది.
గ్రామ పంచాయతీలు పోనీ.. ఇప్పుడు మున్సిపాలిటీలు - కార్పొరేషన్ల ఎన్నికలకు రెడీ అవుదామని ఏర్పాట్లు చేసుకుంటున్నా.. అక్కడ కూడా కేసీఆర్ కు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. మున్సిపాలిటీలు - కార్పొరేషన్ల స్థాయి పెంచుతూ అప్పట్లో కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సమీప గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనానికి నోటిఫికేషన్లు వేశారు. కానీ ఆయా గ్రామస్థులు - ప్రజాప్రతినిధులు దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు కెళ్లారు. తాజాగా శుక్రవారం కరీంనగర్ కార్పొరేషన్ లో గ్రామాల విలీనంపై హైకోర్టు స్టే ఇచ్చింది.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామాల విలీన ప్రక్రియలో శాస్త్రీయత లోపించిందని.. విలీన ప్రక్రియను వాయిదా వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఎన్నో ఆశలతో పంచాయతీ - మున్సిపల్ ఎన్నికలకు వెళదామనుకున్న కేసీఆర్ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది. కాంగ్రెస్ వారు - కొందరు ప్రతిపక్షాలు - కొందరు అసంతృప్తి వాదులు కేసీఆర్ ను ముందడుగు వేయకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు. కేసీఆర్ చేస్తే ఊరుకోవడం లేదు. అమ్మా పెట్టదు.. అడుక్కుతిననివ్వదూ అన్నట్టుంది ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి.
అయితే ప్రస్తుతం రైతు బీమా - రైతుబంధు సహా అద్భుత పథకాలతో కేసీఆర్ ఊపుమీదున్నాడు. ఇప్పుడు ఎన్నికలకు వెళితే గెలవడం పక్కా. అందుకే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ కేసీఆర్ ను గెలవనీయకుండా చేయడానికే ఇలా హైకోర్టు కెళ్లి ఎన్నికలను ఏదో లూప్ హోల్ వెతికి వాయిదా వేసేలా చేస్తున్నాయని టీఆర్ ఎస్ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనా సంస్కరణలతో దూసుకెళదామని ఆశిస్తున్న కేసీఆర్ ముందర కాళ్లకు ఇప్పుడు కోర్టులు బంధం వేస్తున్నాయి.