Begin typing your search above and press return to search.
వాళ్లు డిసైడ్ అయితే కేసీఆర్ కు షాకే
By: Tupaki Desk | 21 July 2016 6:52 AM GMTతిరుగులేని అధికారంతో దూకుడుగా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రికి కళ్లాలు వేయటం కుదురుతుందా? ఆయనకు షాకివ్వటం సాధ్యమవుతుందా? అంటే అవుననే చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. కాకుంటే.. రాజకీయ పార్టీలు కొన్ని కలిసి ఒకేమాటగా నిర్ణయం తీసుకుంటే.. కేసీఆర్ కు షాకుల మీద షాకులు తప్పవని చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పలు పార్టీలకు చెందిన ఎంపీ.. ఎమ్మెల్యేలను ‘కారు’ ఎక్కించిన కేసీఆర్ కు ఇప్పటివరకూ కష్టం అన్నది ఎదురు కాలేదు.
ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బంది లేకున్నా.. ఎంపీల్ని చేర్చుకున్న విషయంలో మాత్రం తిప్పలు తప్పవనే మాట బలంగా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 17 ఎంపీ స్థానాలకు 11 స్థానాల్లో టీఆర్ ఎస్ విజయం సాధించగా..గడిచిన రెండేళ్ల వ్యవధిలో మరో ముగ్గురు ఎంపీలను పార్టీలో చేర్చుకోవటం తెలిసిందే. వీరిలో ఒకరు తెలుగుదేశం పార్టీకి చెందిన మల్లారెడ్డి కాగా.. కాంగ్రెస్ కు చెందిన గుత్తా.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.ఈ ముగ్గురిని పార్టీలో చేర్చుకున్న సందర్భంగా కేసీఆర్ వ్యవహరించిన వైఖరి ఆయనకు కష్టాల్ని కొని తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఒక్క గుత్తాకు తప్ప మిగిలిన ఇద్దరు ఎంపీలను పార్టీలోకి ఆహ్వానించే క్రమంలో పార్టీ కండువా వేసి.. సాదరంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గుత్తా విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నా.. కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటే.. గుత్తా తమ పార్టీ నుంచి జంప్ అయ్యారన్న విషయాన్ని నిరూపించటం పెద్ద కష్టం కాదన్న వాదన వినిపిస్తోంది. ఈ మూడు పార్టీలు కానీ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఫక్షంలో.. ఈ ముగ్గురు ఎంపీల మీద అనర్హత వేటు పడే అవకాశం పుష్కలంగా ఉందన్న మాట వినిపిస్తోంది.
కాకపోతే.. ఏపీలో చంద్రబాబు సైతం నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని (వైఎస్సార్ కాంగ్రెస్) సైకిల్ ఎక్కించిన క్రమంలో.. ఆయన కేసీఆర్ మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికిప్పుడు కాకున్నా.. కేసీఆర్ కు షాకిచ్చేందుకు పార్టీలు వేర్వేరుగా అయినా జంపింగ్స్ మీద ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది.