Begin typing your search above and press return to search.

సార్ కే స‌వాల్ విసిరారు..ఏం జ‌రుగుతుందో ఏమో?

By:  Tupaki Desk   |   8 July 2019 7:45 AM GMT
సార్ కే స‌వాల్ విసిరారు..ఏం జ‌రుగుతుందో ఏమో?
X
అస‌లే కేసీఆర్‌. ఆపైన రెండోసారి దిగ్విజ‌యంగా తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌విని చేప‌ట్టి మంచి ఊపులో ఉన్నారు. త‌న‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా ఉన్న ఆయ‌న‌కు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో షాక్ త‌గిలింది. అయితే.. ఆ వెంట‌నే వెల్ల‌డైన స్థానిక ఎన్నిక‌ల్లో గులాబీ ద‌ళం మ‌ళ్లీ త‌న స‌త్తాను చాటింది. దీంతో.. సార్వ‌త్రికాన్ని స్పెష‌ల్ కేసు కింద తీసుకున్న కేసీఆర్‌.. ఆ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోవ‌టం లేద‌ని చెప్పాలి.

న‌మ్మ‌కాల‌కు పెద్ద‌పీట వేసే కేసీఆర్‌.. తాజాగా కొంగొత్త అసెంబ్లీ.. స‌రికొత్త సెక్ర‌టేరియ‌ట్ ను నిర్మించాల‌ని ఫిక్స్ కావ‌టం తెలిసిందే. దీనికి త‌గ్గ‌ట్లే అంచ‌నాల‌తో పాటు.. డిజైన్ల‌ను కూడా సిద్ధం చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ నిర్మాణానికి ఎర్ర‌మంజిల్ ను ఎంపిక చేసుకున్న కేసీఆర్ తీరును ఆ భ‌వ‌న మాజీ వార‌సులు (గ‌తంలో ప్ర‌భుత్వానికి అమ్మేశారు) సీన్లోకి వ‌చ్చి.. చారిత్ర‌క సంప‌ద‌ను కూల్చేస్తారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బంగారం లాంటి స‌చివాల‌యాన్ని వాస్తు పేరుతో కూల్చివేసి బ్రాండ్ న్యూ స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని డిసైడ్ కేసీఆర్‌ పైన విప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. తాజాగా రౌండ్ టేబుల్ స‌మావేశం పెట్టి మ‌రీ తామంతా ఒక్క‌టేన‌ని.. విప‌క్షాల‌న్ని క‌లిసి కేసీఆర్ తీరును ఎండ‌గ‌ట్టాల‌ని డిసైడ్ అయ్యాయి. అంతేకాదు.. స‌చివాల‌యం.. అసెంబ్లీల నిర్మాణాల‌ను అడ్డుకోవాల‌ని నిర్ణ‌యించాయి. ప్ర‌స్తుతం ఉన్న స‌చివాల‌యాన్ని కూల‌గ‌డొతుంటే చూస్తూ ఊరుకోమంటూ స‌వాల్ విసిరాయి.

మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. త‌న‌కు ఎవ‌రైనా స‌వాల్ విసిరితే తెగ చిరాకు ప‌డిపోయే కేసీఆర్ కు ఏకంగా ఛాలెంజ్ లెవెల్లో వ్యాఖ్య‌లు చేయ‌టం ఆయ‌న‌లో మ‌రింత ప‌ట్టుద‌ల పెంచుతుంద‌న్న మాట వ్య‌క్త‌మ‌వుతోంది. స‌చివాల‌యం కూల్చివేత విష‌యంలో సీఎం కేసీఆర్ వెన‌క్కి త‌గ్గే వ‌ర‌కూ తాము వ‌దిలేది లేద‌ని తేల్చారు. ఇలాంటి మాట‌లు పోరాట‌యోథుడైన కేసీఆర్ కు మ‌రింత ప‌ట్టుద‌ల‌ను పెంచుతాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

సీఎం సార్ ఇగోను ట‌చ్ చేసేలా విప‌క్షాల మాట‌ల నేప‌థ్యంలో.. ఈ నిర్మాణాల విష‌యంలో కేసీఆర్ మ‌రింత ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెప్పక త‌ప్పదు. అధికార‌ప‌క్షం.. విప‌క్షం రెండూ సీరియ‌స్ గా.. వ్య‌క్తిగ‌త అంశంగా తీసుకోనున్న నేప‌థ్యంలో ఈ ఇష్యూ రానున్న రోజుల్లో మ‌రింత ఉద్రిక్త‌త‌ల‌కు తెర తీసే అవ‌కాశం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.