Begin typing your search above and press return to search.
శ్రీనివాస్ హత్యపై పార్లమెంట్ దద్దరిల్లింది
By: Tupaki Desk | 9 March 2017 9:32 AM GMTతెలుగు ఎన్నారై కూచిభొట్ల శ్రీనివాస్ అమెరికాలో శ్వేతజాతీయుడి చేతిలో హత్యకు గురైన అంశంపై ఇవాళ పార్లమెంట్ లో సుదీర్ఘ నడించింది. ప్రతిపక్షాలు వర్సెస్ అధికార పార్టీ అన్నట్లుగా వాదోపవాదాలు సాగాయి. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లిఖార్జున్ ఖర్గే ఈ విషయాన్ని సభలో లేవెనెత్తారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అధికారాలు చేపట్టిన తర్వాతనే ఆ దేశంలో ఇలాంటి దాడులు పెరిగాయని ఖర్గే ఆరోపించారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను వెల్లడించాలని ఖర్గే కోరారు. కూచిభొట్లపై జాతివివక్ష దాడి జరిగిందని, దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతి అంశాల్లో ట్వీట్లు చేసే ప్రధాని ఈ ఘటనపై ఎందుకు ట్వీట్ చేయలేదన్నారు.
టీఆర్ ఎస్ శాసనసభా పక్ష నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ మీ దేశానికి వెళ్లిపో అంటూ శ్రీనివాస్ పై శ్వేతజాతీయుడు కాల్పులు జరిపారని గతంలో అమెరికాలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేసిన విధంగానే తాము కూడా కేంద్రం నుంచి కూచిబొట్ల హత్యపై ప్రకటన ఆశిస్తున్నామని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగు ప్రకటన చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. వీరికి టీఎంసీ సౌగత్ రాయ్ సైతం జతకూడారు. అమెరికాలో భారతీయులను సరిగా చూడడం లేదని ఆయన ఆరోపించారు. హెచ్1బీ వీసాల వల్ల భారతీయులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించారు. అమెరికాలో జాతివివక్ష దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారతీయులకు ఏమైనా అడ్వైజరీ జారీ చేస్తుందా అని ఒడిశా ఎంపీ భర్తృహరి ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వీరికి సమాధానాలు ఇచ్చారు. అయితే భారతీయులకు రక్షణ కల్పించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రభుత్వం వచ్చే వారం ప్రకటన చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను సీరియస్‌గా తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కన్సాస్ లో ఓ శ్వేతజాతీయుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ మృతిచెందడం, మరో యువకుడు అలోక్ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ అంశంపై సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో టీఎంసీ ఎంపీలు అమెరికా దాడులకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన కూడా నిర్వహించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/