Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రంలో సంచలనం..బాబాలకు కేబినెట్ హోదా
By: Tupaki Desk | 4 April 2018 5:27 PM GMTబీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదుగురు బాబాలకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది. వీళ్లు హిందూ మతం ప్రచారం చేస్తుంటారు. కొన్నేళ్లుగా బాబాలుగా సమాజంలో చలామణి అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా వీరిని ప్రభుత్వంలోకి తీసుకోవటం పలువురిని షాక్ కు గురి చేసింది. అయితే తాము నది పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్రం వెల్లడించింది.
కేబినెట్ మినిస్టర్ హోదా కల్పించిన ఐదుగురు బాబాల వివరాలు ఇలా ఉన్నాయి. ఇండోర్‌కు చెందిన ఈ వ్యక్తి కంప్యూటర్ బాబాగా చలామణి అవుతున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన కుంభమేళా ఘాట్స్ దగ్గర నేరుగా హెలికాఫ్టర్ నుంచి దిగేందుకు ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద పాపులారిటీ సంపాదించారు. ల్యాప్ ట్యాప్ - మొబైల్ లేకుండా అడుగు బయట పెట్టడు. దీంతో అందరూ కంప్యూటర్ బాబా అంటారు. ఇతని అసలు పేరు నందియో దాస్ త్యాగి. మరో బాబా పండిట్ యోగేంద్ర మహన్. నర్మదా నది ప్రక్షాళన కోసం చేపట్టిన క్యాంపెయిన్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితోపాటు బైయ్యూ మహారాజ్ - నర్మదానంద్ మహారాజ్ - హరిహరానంద్ మహారాజ్ లు కూడా కేబినెట్ ర్యాంక్ పొందారు. వీరు ఐదుగురు బాబాలు కొన్నేళ్లుగా నర్మదా నది ప్రక్షాళన - శుద్ధి చేపట్టాలని ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఐదుగురు బాబాలను నర్మద నది అంశానికి సంబంధించిన కమిటీలో సభ్యులుగా నియమించింది శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం. ఈ తర్వాత వారం రోజులకే కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ సెక్యూరిటీ ఇచ్చింది. ఈ పరిణామంపై సహజంగానే కాంగ్రెస్ మండిపడింది.