Begin typing your search above and press return to search.
తిరుపతి బై పోల్ : జనసేనను కలుపుకోవాలని బీజేపీ .. కమలంతో దోస్తీ కట్టాలని టీడీపీ !
By: Tupaki Desk | 19 Nov 2020 9:10 AM GMTఆంధ్రప్రదేశ్ లో బై పోల్ సమరానికి అన్ని ప్రధాన పార్టీలు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇటీవలే తెలంగాణ లో ముగిసిన దుబ్బాక బై పోల్ లో వచ్చిన ఫలితాన్ని బేరీజు వేసుకొని పొత్తులపై ఓ అవగాహనాకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే , కొన్ని పార్టీలు ఒంటరిగా బరిలో నిలవాలని ఆలోచిస్తుంటే , మరికొన్ని పార్టీలు రెండు కళ్ల ధోరణితో ముందుకుపోయేలా కనిపిస్తున్నాయి. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ దుర్మరణం తో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. దీనితో త్వరలోనే అక్కడ బై పోల్ జరగబోతుంది. దీనితో ఇప్పటినుండే పొత్తుల కోసం పక్క పార్టీలతో మంతనాలు సాగిస్తున్నాయి. వీటిల్లో కొన్ని పార్టీల మధ్య ఒప్పందం కుదిరినా అభ్యర్థి గా మాత్రం తమ వాడే ఉండాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.
ఎన్నికల ప్రయోజనం పొందేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ ఏకంగా అభ్యర్థిని సైతం ప్రకటించింది. అయినప్పటికీ , టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మాత్రం మరోలా ఉందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇకపోతే , 2019 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి బరిలోకి దిగాయి. ఆ సమయంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. అలాగే , గెలవగలిగే సత్తా లేకపోయినా జనసేన ఒంటరిగానే పోటీచేసింది. కానీ, అప్పుడు ఆ పార్టీలు విజయాన్ని అందుకోలేకపోయాయి. దీనితో ప్రస్తుతం మళ్లీ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి.
తెలంగాణలోని దుబ్బాకలో విజయం సాధించిన నేపథ్యంలో తిరుపతిలో కూడా ఒంటరిగానే పోటీచేయాలని బీజేపీ భావిస్తోందట. అయితే ,జనసేన మద్దతును మాత్రం కోరుకుంటోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే .. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తులు ఉండవని బీజేపీ స్పష్టం చేయడం తో , ఆ నిర్ణయం పై జనసేన ఆగ్రహంగా ఉంది. దుబ్బాక లో పొత్తు పెట్టుకొని, అవసరం తీరిన తర్వాత ఇప్పుడు వద్దు అంటారా అంటూ ఫైర్ అవుతుంది. ఒకవేల తిరుపతిలో పొత్తు కుదిరినా తమ పార్టీ అభ్యర్థినే బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై జీహెచ్‌ఎంసీ ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ కూడా తీవ్రంగానే కష్టపడుతుంది. ఇక టీడీపీ విషయానికొస్తే .. ఈ ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతమే అమలు చేయాలనీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకునేందుకు రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి కనిపించకపోవడంతో ఎవరికి వారు దళిత కార్డును వాడుకుని ప్రయోజనం పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు.