Begin typing your search above and press return to search.

అమ్మాయిల వివాహ వయసు పెంపు పై వ్యతిరేకత.. ఏం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   14 April 2022 6:28 AM GMT
అమ్మాయిల వివాహ వయసు పెంపు పై వ్యతిరేకత.. ఏం జరుగుతోంది?
X
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బాల్య వివాహాల నిషేధ బిల్లు లోని యువతుల వివాహ వయసు ను 21 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రజా స్పందనల్లో.. ఎక్కువ మంది ఈ పెంపు సరి కాదని చెబుతున్నారు. అయితే ఈ అంశంపై పార్లమెంట్ స్థాయి సంఘం ప్రజా అభిప్రాయాల్ని కోరగా... అందించిన అభిప్రాయాల్లో దాదాపు 95 శాతం మంది ప్రతికూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

భాజపా ఎంపీ వినయ్ సహస్ర బుద్ధే నేతృత్వంలోని పార్లమెంట్ స్థాయి సంఘానికి విద్య, మహిళలు, బాలలు, యువత, క్రీడలకు సంబంధించి చేసిన 95 వేల ఈ మెయిళ్లలో 90 వేల సందేశాలు... వివాహ వయసు పెంపు ను తిరస్కరించాయి. 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల కు పెంచడం సరికాదంటూ వివరించారట. మహిళ ల మేలు కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే ప్రతికూల స్పందన లు వచ్చాయన్న అనుమానాన్ని కమిట వ్యక్తం చేసింది.

అత్యధిక సందేశాల్లోని విషయం చాలా వరకు ఒకే లాగా ఉందని తెలిపింది. అయితే ఆ మెయిల్ అన్ని ఒకే చోటు నుంచి వచ్చి ఉండవచ్చనే సందేహాన్ని వెలిబుచ్చింది. బాల్య వివాహాల సవరణ బిల్లును కేంద్రం గత డిసెంబర్ లో లోక్ సభలో ప్రవేశ పెట్టింది. అనంతరం స్థాయీ సంం పరిశీలనకు బిల్లును పంపించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న మత సంస్థల ప్రతి నిధులను స్థాయీ సంఘం ఆహ్వానించి మాట్లాడాలని కమిటీ సభ్యులు సూచించారు.

పార్లమెంట్ కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా పర్యటించి మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయాలు కూడా తెలుసు కోవాలని అన్నారు. అప్పుడే యువతుల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్ల కు పెంచడంపై ప్రజల సరైన అభిప్రాయం తెలుసుకోగమని వివరించారు.

అయితే ఇలాంటి సర్వే చేపట్టి ప్రజా అనుకూలత అంశాల ఆధారంగానే ప్రభుత్వం తమ నిర్ణయాలను అమల్లోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు. ప్రజల కోసమే తమ పాలన అంటూ వివరించారు. వారికి ఇష్టమైన, మంచి చేసే బిల్లులనే అమల్లోకి తీసుకొస్తామని... వారికి ఇష్టం లేకుండా, ఫలితం లేకుండా, నష్టం చేకూర్చే ఆ పథకాన్ని, బిల్లను ఆమోదించబోమని అన్నారు.

అయితే మరి యువతుల వివాహ వయసు 21 ఏళ్లకు పెంపు అంశం పై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఒక వేళ ప్రతికూల స్పందనే ఎక్కువగా వస్తే.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది కూడా అప్పుడే తెలుస్తుంది. ఒక వేళ ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తే ఈ బిల్లును కచ్చితంగా అమల్లోకి తీసుకు వస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.