Begin typing your search above and press return to search.
ఇమ్రాన్ ఒక్క మాటతో మోడీకి చుక్కలు
By: Tupaki Desk | 11 April 2019 5:02 AM GMTఒకే ఒక్క మాట. ప్రధాని మోడీని ఇరుకున పడేయటమే కాదు.. ఆయన్ను తీవ్రంగా ఇబ్బందికి గురి చేసేలా చేసింది. ఇంతకీ అదేమైనా తప్పుడు మాటా? అంటే కాదు. వినేందుకు.. చదివేందుకు ఏ మాత్రం ఇబ్బందికి గురి చేయని ఆ మాటను అర్థం చేసుకున్నంతనే ఒళ్లు మండిపోయేలా చేస్తుంది. ఒక్క బాంబు.. ఒక యుద్ధ విమానాన్ని ప్రయోగించకుండానే మోడీ మాష్టారిని తన సింఫుల్ మాటతో పాక్ ప్రధాని ఇమ్రాన్ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారని చెప్పక తప్పదు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ ఈ రోజు మొదలైంది. దీనికి రోజు ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ సంచలన వ్యాఖ్య చేశారు. విపక్ష పార్టీలు పాక్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నాయంటూ మోడీ అండ్ కో చేస్తున్న ప్రచారానికి భిన్నంగా.. తన నోటి మాటతో మోడీ బ్యాచ్ ను ఇరాకటంలో పడేశారు పాక్ ప్రధాని ఇమ్రాన్.
విదేశీ పాత్రికేయులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా బుధవారం ఇమ్రాన్ మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు అవకాశం ఏర్పడుతుందని, కశ్మీర్ సమస్యా పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. మోడీనే మళ్లీ భారత ప్రధాని కావాలని ఇమ్రాన్ కోరుకుంటున్నారని.. వారిద్దరి మధ్య అవగాహన ఉన్నట్లుగా పేర్కొంటూ విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఇమ్రాన్ వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇంతకాలం పాక్ పేరు చెప్పి విపక్షాల్ని ఒక ఆట ఆడుకున్న దానికి భిన్నంగా విపక్షాల చేతిలో మోడీ బ్యాచ్ ఇరుక్కుపోయాయి. ఇమ్రాన్ మాటలతో మోడీతో పాక్ కు అధికారికంగానే స్నేహబంధం ఉన్నట్లు తెలుస్తోందని కాంగ్రెస్ మండిపడ్డారు. కాసింత ఎటకారంగా.. మోడీజీ మీకు తొలుత నవాజ్ షరీఫ్ పట్ల ఆపేక్ష ఉండేది.. ఇప్పుడు ఇమ్రాన్ ప్రియ మిత్రులు అయ్యారు.. అసలు నిజం బయటకు వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మోడీ తీరు మొదట్నించి అనుమానాస్పదంగానే ఉండేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.
భారత ప్రధానిగా ఎవరు ఉండాలో పాక్ కోరుకుంటున్న విషయం ప్రపంచానికి అర్థమైందన్నారు. ఆహ్వానం లేకుండానే పాక్ కు వెళ్లిన ఏకైన ప్రధాని మోడీ అని.. ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలను విదేశీ ప్రభుత్వాలు ప్రభావితం చేయటం ఏమిటంటూ మండిపడ్డారు.
తన తరఫున ఇమ్రాన్ ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నారో మోడీ సమాధానం చెప్పాలని సీపీఐ నేత రాజా ప్రశ్నించగా.. పాక్.. అక్కడి ఉగ్రవాదులు బీజేపీ ఓడిపోవాలని మోడీ ఇప్పటివరకూ చెప్పారని.. అలాంటి వారు మోడీనే మళ్లీ గెలవాలని ఎందుకు కోరుకుంటున్నారో సమాధానం చెప్పాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
ఈ ఏపిసోడ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ఒక అడుగు ముందుకేసి.. ఎన్నికల్లో మోడీ గెలిస్తే పాక్ లో మతాబులు పేల్చుకుంటారంటూ పార్టీ అధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది. పాక్ తో మోడీకి ఉన్న బలమైన బంధం ఏమిటో ఆయన వెల్లడించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ నోటినుంచి వచ్చిన ఒక్క మాట మోడీపై అనుమానాన్ని పెంచటమే కాదు.. విపక్షాలకు దన్నుగా మారటం కనిపిస్తుంది. మరి.. ఈ ఇష్యూపై మోడీ రియాక్షన్ ఏమిటో..?