Begin typing your search above and press return to search.

మోడీకి 'గాంధీ'తో సోనియా షాక్‌!

By:  Tupaki Desk   |   12 July 2017 5:15 AM GMT
మోడీకి గాంధీతో సోనియా షాక్‌!
X
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల సిరీస్ లో భాగంగా ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వికి కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌లో రామ్‌ నాథ్ కోవింద్‌ ఎంపిక ద్వారా మోడీ అంద‌రి కంటే ముందే విపక్షాల‌కు ఒక పంచ్ విసిరితే.. తాజాగా ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో సోనియా అండ్ కో (కాంగ్రెస్ తో స‌హా 18 పార్టీలు ఏకగ్రీవంగా ఎంపిక చేశాయి) క‌లిసి త‌మ ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా గోపాల‌కృష్ణ గాంధీని ప్ర‌క‌టించాయి.

ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్రప‌తిగా అన్సారీ వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఆయ‌న ప‌ద‌వీ కాలం ఆగ‌స్టు 19తో ముగియ‌నుంది. ఆగ‌స్టు 5న ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. విప‌క్షాల ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక ప్ర‌క‌ట‌న మోడీ అండ్ కోను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేశాయ‌ని చెబుతున్నారు.

ఎందుకంటే.. గోపాల్ కృష్ణ గాంధీ బ్యాక్ గ్రౌండ్ అలాంటిది మ‌రీ. ఇంత‌కీ గోపాల్ కృష్ణ‌ గాంధీ ఎవ‌రు? ఆయ‌న ఏ ర‌కంగా తోపు? ఆయ‌న‌కు సంబంధించిన అరుదైన అంశం ఏమిటి? దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రికి గోపాల్ కృష్ణ గాంధీ క‌నెక్ష‌న్ ఉంద‌న్న మాట‌లోనిజం ఎంత‌? అన్న విష‌యాల్ని చూస్తే..

ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థి విష‌యంలో విప‌క్షాలు తెర మీద‌కు తీసుకొచ్చిన వ్య‌క్తి గోపాల్ కృష్ణ గాంధీ. ఈయ‌న‌తో ప్ర‌తి ఒక్క భార‌తీయుడికి రెండు సంబంధాలు ఉన్నాయి. అందులో ఒక‌టి ఆయ‌న తండ్రి త‌ర‌ఫు తాత మ‌హాత్మాగాంధీ. అయితే.. అదే స‌మ‌యంలో ప్ర‌ముఖ రాజనీతిజ్ఞుడైన సి.రాజగోపాలాచారి మ‌న‌మ‌డు కూడా గోపాల్ కృష్ణ గాంధీ. ఇలా ఇద్ద‌రు ప్ర‌ముఖుల మ‌న‌వ‌డిగా మంచి చ‌రిత్ర ఉంది.

ఇక‌.. ఆయ‌న పుట్టుపూర్వోత్త‌రాల విష‌యంలోకి వెళితే..

= దేవదాస్ గాంధీ, లక్ష్మీగాంధీ దంపతులకు 1946 ఏప్రిల్ 22న గోపాల్ కృష్ణ గాంధీ జ‌న్మించారు

= సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఇంగ్లీష్ లిట‌రేచ‌ర్ లో మాస్ట‌ర్స్ చేశారు.

= 1968లో ఐఏఎస్ అధికారిగా త‌న కెరీర్ ను స్టార్ట్ చేశారు

= ఐఏఎస్ అధికారికంగా 80ల వ‌ర‌కూ త‌మిళ‌నాడులో ప‌ని చేశారు

= 1985 -1987 మ‌ధ్య కాలంలో భార‌త ఉప రాష్ట్రప‌తి కార్య‌ద‌ర్శిగా, భార‌త రాష్ట్రప‌తి జాయింట్ సెక్ర‌ట‌రీగా కూడా ప‌ని చేశారు

= 1992 - 2003 వ‌ర‌కూ ప‌లు కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు.

= 1996లో సౌతాఫ్రికా రాయ‌బారిగా వ్య‌వ‌హ‌రించారు. శ్రీలంక‌.. నార్వే.. ఐస్ లాండ్ ల‌కు సైతం రాయ‌బారిగా వ్య‌వ‌హ‌రించారు.

= 2004 నుంచి 2009 వ‌ర‌కూ ప‌శ్చ‌మ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు

= బెంగాల్ రాజ‌కీయాల్లో కీల‌క ద‌శ వేళ గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. త‌న ప‌నితీరుతో ప్ర‌శంస‌లు అందుకున్నారు.

= బెంగాల్‌ కు గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న వేళ‌లో.. రాష్ట్ర ప్ర‌భుత్వం క‌మ్యూనిస్టుల చేతిలో ఉండేది. అనంత‌రం నందిగామ్‌.. సింగూర్ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో క‌మ్యూనిస్టుల బ‌లం త‌గ్గి తృణ‌మూల్ కాంగ్రెస్ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది.

= ఇంత కీల‌క స‌మ‌యంలో గోపాల‌కృష్ణ గాంధీ వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

= సంక్షోభ స‌మ‌యంలో సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించ‌టం గోపాల్ కృష్ణ గాంధీ ఇమేజ్ ను మ‌రింత పెంచింది.