Begin typing your search above and press return to search.
ఫిడేలు వాయిస్తున్న ప్రధాని మోడీ
By: Tupaki Desk | 9 Dec 2016 5:42 AM GMTఇప్పటివరకు కొన్ని వర్గాలు మన దేశంలో బ్లాక్ డే పేరుతో అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చి వేసిన డిసెంబరు 6వ తేదీని పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రోజును ప్రతిపక్షాలు మార్చేశాయి. పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8వ తేదీని బ్లాక్ డే గా ప్రకటించాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడి నెలరోజులు గడిచిన సందర్భంగా ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో గురువారం బ్లాక్ డే పాటించాయి. కాంగ్రెస్ నేతలతోపాటు తృణమూల్, సీపీఎం, సీపీఐ, జేడీ(యూ), ఎస్పీ సభ్యులు చేతికి నల్లటి రిబ్బన్లు కట్టుకొని ఆందోళనలో పాల్గొన్నారు.
పెద్ద నోట్లు రద్దయి 30రోజులు గడిచినా నగదు కోసం సామాన్యులు ఇంకా అష్టకష్టాలు పడుతున్న నేపథ్యంలో విపక్ష పార్టీలు ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్నది తెలివితక్కువ నిర్ణయం అని వ్యాఖ్యానించాయి. ఒక వ్యక్తి ఆర్థిక విపత్తును సృష్టించాడు అని ధ్వజమెత్తాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, ప్రధాని తెలివితక్కువ నిర్ణయం దేశాన్ని నాశనం చేసిందన్నారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికి వందమందికి పైగా మరణించారని ఆరోపించారు. రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడు అన్న చందంగా ప్రధాని మోదీ చేష్టలుడిగిపోయారని కాంగ్రెస్ పార్టీ తమ వెబ్‌సైట్‌లో వ్యా ఖ్యానించింది. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి మోదీ ఒక్కరే బాధ్యులు అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుత ఆర్థిక విపత్తుకు ప్రధానమంత్రిదే పూర్తి బాధ్యత అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. కోల్‌కతాలో ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాని మోడీ నిర్ణయం ఆర్థిక విపత్తుకు దారితీసిందని, అందువల్ల ఇక ఎంతమాత్రం ఆయన పదవిలో కొనసాగడానికి అర్హుడుకాదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోడీ నేతృత్వంలోని ప్రస్తుత సర్కార్ పట్టాలు తప్పిందని అన్నారు. "ప్రధాని ఎవరినీ నమ్మరు. ప్రభుత్వంలో సమిష్టి కృషి లేదు. దేశానికి ఏది మంచిదో ఆయనకు అర్థః కాదు. నిపుణులను సంప్రదించలేదు. ఇది నియంతృత్వం.. ఇది మనిషి సృష్టించిన విపత్తు.. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి అంటూ మమత విరుచుకుపడ్డారు. ఇప్పటికి వంద మంది వరకు మరణించారు.. ఇంకెంతమంది చావాలి మోడీ బాబూ?" అని నిలదీశారు.
ప్రతిపక్షాలు బ్లాక్ డే పాటించడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు బ్లాక్ మనీ సపోర్ట్ డే (నల్లధనానికి మద్దతు దినం) పాటిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీకి ధైర్యముంటే నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో మాట్లాడాలని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంథ్ శర్మ సవాల్ చేశారు. రాహుల్ అసమర్థత, అహంకారంతో వ్యాఖ్యలు చేస్తూ పతాక శీర్షికలకెక్కేందుకు కేజ్రీవాల్‌తో పోటీపడుతున్నారని విమర్శించారు.