Begin typing your search above and press return to search.
పార్లమెంట్ లో తొలిరోజే మోడీకి షాకిచ్చిన విపక్షాలు
By: Tupaki Desk | 19 July 2021 7:34 AM GMTపార్లమెంట్ లో తొలిరోజే విపక్షాలు షాక్ ఇచ్చాయి. ప్రధాని మోడీ ప్రసంగం మొదలుపెట్టగానే పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్యులను మోడీ సర్కార్ దోచుకుంటోందని ఆరోపించాయి. ఎంత చెప్పినా విపక్షాల ఎంపీలు తగ్గకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మోడీ ప్రసంగిస్తున్నా.. వద్దన్న విపక్ష ఎంపీలు తగ్గేదేలే అంటూ హోరెత్తించారు. తొలిరోజే బీజేపీకి పార్లమెంట్ లో గట్టి షాక్ తగిలినట్టైంది.
పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభంకాగానే ఇటీవలే ఎన్నికైన కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి సహా నలుగురు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ఇటీవల కేంద్రమంత్రివర్గంలో మార్పులు జరగడంతో కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు.
ఇక ప్రధాని మోడీ మాట్లాడడం మొదలుపెట్టగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దేశంలో పెట్రోల్ ధరల పెంపు, కరోనా ఇతర అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. స్పీకర్ కల్పించుకొని ప్రతిపక్ష సభ్యులను వారించారు. అయినా వారు నినాదాలు కొనసాగించడంతో ఆందోళనల నడుమే ప్రధాని ప్రసంగం కొనసాగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈసారి ఎక్కువ మంది ఎస్సీలు మంత్రులు కావడం శుభపరిణామం అని అన్నారు. మహిళలు, ఓబీసీలు, రైతుల బిడ్డలు మంత్రులు కావడం కొందరికి ఇష్టం లేదని.. అందుకే వారిని సభకు పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారంటూ విపక్షాలను దుయ్యబట్టారు.
ఇక అనంతరం ఇటీవల మృతిచెందిన ఎంపీలు, మాజీ ఎంపీలకు లోక్ సభ సంతాపం తెలిపింది. కరోనా, ఇతర కారణాలతో గత సమావేశాల నుంచి ఇప్పటిదాకా ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, 50మంది మాజీ ఎంపీలు కన్నుమూశారని తెలిపారు.ఇక చనిపోయిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అజ్మీరా చందూలాల్, ఎం. సత్యనారాయణరావు, సబ్బం హరి ఉన్నారు.
ఇక ఈ సంతాప కార్యక్రమం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అయితే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
ఇక రాజ్యసభలోనూ దివంగత ఎంపీలు, మాజీ ఎంపీలకు నివాళులర్పించారు. ప్రముఖ నటులు దిలీప్ కుమార్, మిల్కాసింగ్ కు శ్రద్ధాంజలి ఘటించారు. రాజ్యసభలో ఆందోళన మొదలు కావడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.