Begin typing your search above and press return to search.
ఇన్ని పేర్లలో... ఎన్ని జిల్లా పేర్లుగా అవుతాయో?
By: Tupaki Desk | 8 Oct 2016 9:40 AM GMTకొత్త జిల్లాల వ్యవహారం గందరగోళంగా మారిందా? అంటే అవుననే మాటను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కానట్లుగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇవాల్టి రోజును..దసరా రోజును తీసేస్తే.. కేవలం కొత్త జిల్లాలకు సంబంధించిన మొత్తం ప్రక్రియను పూర్తి చేయటానికి రెండంటే రెండు రోజులు మాత్రమే ఉన్న విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు.
నిన్నటికీ 31 జిల్లాల్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా చెబుతున్నా.. ఆ జిల్లాలు ఏంటి? వాటి పేర్లు ఏమిటన్న అంశంపై స్పష్టత రాని పరిస్థితి. మరోవైపు.. కొత్త జిల్లాలకు సంబంధించిన డిమాండ్లు ఒక కొలిక్కి రాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ల తీవ్రత తగ్గలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.మరోవైపు.. కొత్తగా ప్రకటించే జిల్లాలకు పెట్టాల్సిన పేర్లపై ఎవరికి వారు తమ వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. వీటిల్లో ఎన్నింటి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో..? మరెన్నింటిని పట్టించుకోదన్నది ఒక ప్రశ్న. జిల్లా పేర్ల మీద వస్తున్న డిమాండ్లకు భిన్నంగా ప్రభుత్వం కానీ పేర్లు డిసైడ్ చేస్తే.. అదో అసంతృప్తిగా మారుతుందన్న భావన వ్యక్తమవుతోంది.
జిల్లాల వారీగా పలువురు ప్రముఖుల పేర్లు పెట్టాలంటూ వివిధ వర్గాల వారు తెర మీదకు తెస్తున్న వాదనల్ని పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి కోరుతున్నారు. పరిశీలించేది ఎప్పుడు?ఖరారు చేసేది మరెప్పుడు? చివరకు ఫైనల్ చేసేది ఇంకెప్పుడు? అన్నది మరో ధర్మ సందేహం. ఒకపక్కన కాలం పరుగులు పెడుతుంటే.. పనులు మాత్రం ఒక కొలిక్కి రాలేదని.. కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే విషయంలో ఉన్న ఇబ్బందే దీనికి కారణంగా చెబుతున్నారు. కొత్త జిల్లాల పేర్లకు సంబంధించిన ప్రముఖల పేర్లు చూస్తే.. ఆచార్య జయశంకర్.. కొమురం భీమ్.. కేవీ రంగారెడ్డి.. భద్రాద్రి.. యాదాద్రి.. జోగులాంబ (గద్వాల).. మంజీరా (సంగారెడ్డి).. చాకలి ఐలమ్మ (జనగామ).. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు.. సురవరం ప్రతాపరెడ్డి.. రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి.. జి. వెంకటస్వామి.. పి.మహేంద్రనాథ్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీటిల్లో ఎన్నింటిని ముఖ్యమంత్రి ఫైనల్ చేస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/