Begin typing your search above and press return to search.

పవన్ చేతికి చేరిన ఆరెంజ్ కలెక్షన్స్

By:  Tupaki Desk   |   19 May 2023 6:27 PM
పవన్ చేతికి చేరిన ఆరెంజ్ కలెక్షన్స్
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. కెరీర్ లో దారుణంగా అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే, వాటిలో ఆరెంజ్ మాత్రం డిఫరెంట్. పదేళ్ల క్రితం విడుదైలనప్పుడు ఇదేం సినిమారా బాబు అన్నారంతా. ఇప్పుడు ఏం సినిమారా బాబు.. ఇదెలా ప్లాప్ అయ్యింది అంటున్నారు. ఒకప్పుడు అస్సలు బాలేదు అన్నవారే, ఇప్పుడు ఈ సినిమా విడుదలయ్యి ఉంటేనా కలెక్షన్ల సునామీ సృష్టించేవాళ్లం అన్నారు.

అందుకే ఫ్యాన్స్ కోరిక మేరకు ఇటీవల ఈ ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేశారు. నిజంగానే రి రిలీజ్ ని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు నచ్చని మ్యూజిక్ లవర్స్ ఎవరూ ఉండరు. ఈ మూవీలోని పాటలు అప్పుడెంత ఉర్రూతలూగించాయో, ఇప్పుడు విన్నా అదే లవ్ ఫీల్ కలిగిస్తాయి.

అయితే, ఈ మూవీ రిరీలీజ్ చేసిన సమయంలో వచ్చిన కలెక్షన్ ని ఏం చేశారో తెలుసా? జనసేన పార్టీకి డొనేషన్ ఇచ్చారు. ఈ మూవీకి మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఆ సమయంలో సినిమా ప్లాప్ తో ఆయన తీవ్రంగా నష్టపోయారు. అయితే, మూవీ రీరిలీజ్ చేసిన తర్వాత వచ్చిన మొత్తాన్ని జనసేనకు ఇస్తాం అంటూ గతంలోనే ప్రకటించగా, ఇప్పుడు అదే నిజం చేశారు.

ఈ చిత్రం రీ రిలీజ్ లో కీలక పాత్ర పోషించిన “బేబీ” దర్శకుడు సాయి రాజేష్, ఆ చిత్ర నిర్మాత, ఎస్ కె ఎన్ లు ఈ మొత్తాన్ని జనసేన పార్టీకి అందించారు. మొత్తం కోటి ఐదు లక్షల రూపాయలు కలెక్షన్ల రూపంలో వచ్చాయట. వాటిని చెక్ రూపంలో పవన్, నాగబాబులకు అందజేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి ఈ చెక్ ఇచ్చారు. కాగా వారు చేసిన పనికి మెగా అభిమానులు ఆనందపడుతున్నారు. ఈవిధంగా చరణ్ మూవీ పవన్ కి ఉపయోగపడటం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఆరెంజ్ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. నాగాబాబు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో చరణ్ కి జోడిగా జెనీలియా నటించడం విశేషం. ఒక ప్లాప్ మూవీకి పదేళ్ల తర్వాత ఇంత పాజిటివిటీ రావడం చాలా అరుదుగా జరిగే విషయం. కాగా... ఈ సందర్భంగా నాగబాబు, చరణ్ ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.