Begin typing your search above and press return to search.

నల్లజాతీయుల దేశంలో అరుదైన శ్వేత జాతీయుల పట్టణం

By:  Tupaki Desk   |   11 Aug 2022 11:30 PM GMT
నల్లజాతీయుల దేశంలో అరుదైన శ్వేత జాతీయుల పట్టణం
X
దక్షిణాఫ్రికా అనగానే అడుగడుగానా నల్లజాతీయులపై ఆధిపత్యం, తెల్లజాతీయుల అహంకారం ఇలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఆ జట్టులో నల్లజాతీయులకు స్థానం కల్పించలేదని ఏకంగా ఐసీసీ వీరిని 90వ దశకం వరకూ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడనీయలేదు. ఇప్పటికీ సౌతాఫ్రికాలో నల్లజాతీయులకు సంఘీభావం ప్రకటించడానికి శ్వేతజాతీయులు ముందుకు రారు. ఇటీవల దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్.. ఏకంగా అమెరికన్ నల్లజాతీయుడి మరణానికి సంఘీభావం ప్రకటించకుండా మైదానంలో అలానే నిలుచుండడం వివాదాస్పదమైంది.

అంతలా శ్వేతజాతీయుల అహంకారం కొనసాగే దక్షిణాఫ్రికాలో వారి కోసం ఒక ప్రత్యేక పట్టణం ఉందంటే అతిశయోక్తి కాదేమో.. దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులు జనాభా ఎక్కువగా ఉంది. ఇక్కడ అధిక ఎండల కారణంగా అక్కడ జీవించే మనుషులు అలా నల్లగా కనిపిస్తారు. అయితే ఆ దేశంలో ‘ఒరానియా’ అనే విచిత్రమైన పట్ణం ఉంది. అక్కడ మొత్తం శ్వేత జాతీయులే ఉంటారు. పైగా ఆ పట్టణం దక్షిణాఫ్రికాతో సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది. అక్కడ రోడ్డు ఊడ్చే వక్తి నుంచి కార్మికులు, సెక్యూరిటీ గార్డు వరకూ అంతా తెల్లవాళ్లే కావడం విశేషం. ఆ ప్రాంతంలోని ఇళ్లు కూడా తెల్లగా ఉండే వాళ్లకు మాత్రమే ఇవ్వబడును అని ఉంటుంది.

ఈ పట్టణంపై పలు వివాదాలు కూడా ఉన్నాయి. కేవలం జాత్యాహంకారానికి తెర లేపుతుంది. వర్ణ వివక్షతకు ఆజ్యం పోస్తుందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ ఒరానియా పట్టణ వాసులు మాత్రం అదేం కాదని వాదించడం విశేషం.

1991 నుంచే ‘ఒరానియా’ పట్టణం అలానే ఉంది. వారంతా 17వ శతాబ్ధపు డచ్ వలసదారుల వారసులు కావడం గమనార్హం. దక్షణాఫ్రికాలోని ఆరెంజ్ నది ఒడ్డున సుమారు 8వేల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసి ప్రైవేట్ యాజమాన్యంతో కలిసి ఒకే పట్టణంగా ఏర్పరుచుకున్నారు. అప్పుడు ఈ ఒరానియా ప్రాంతంలో జనాభా తక్కువే. అయితే కాలక్రమేణ వర్ణ వివక్ష అనంతరం ఏర్పడిన రాజ్యాంగాన్ని అనుసరించి స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన నగరంగా తీర్చిదిద్దారు.

పట్టణవాసులు మాత్రం దక్షిణాఫ్రికాలో పీడిస్తున్న నేరాలు, విద్యుత్ కోతలు, స్థానిక పాలనలో ఉన్న సమస్యలకు దూరంగా తాము ఏర్పరుచుకున్న కమ్యూనిటీగా అభివర్ణించుకున్నారు. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం.. ఒరానియాకు స్వీయ నిర్ణయాధికారం ఉంది. పైగా కేంద్రప్రభుత్వం నుంచి స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది.

అంతేకాదు.. దక్షిణాఫ్రికా రాజ్యాంగం ప్రకారం.. ఒరానియాకు స్వీయ నిర్ణయాధికారాలు కల్పించడం విశేషం. అక్కడి ప్రభుత్వం నుంచి స్వయం ప్రతిపత్తి గల పట్టణం ఇదే. ఇక్కడ ప్రత్యేక కరెన్సీ కూడా ఉండడం విశేషం. ఇక ఈ పట్టణంలో కేవలం శ్వేతజాతీయులే ఉండాలి. దానికి కొన్ని విలువలు పాటించాలి. బాధ్యతగా మెలగాలి. సభ్యత్వం పొంది ఉండాలి. ఒరానియాలో ఉండేందుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చునని.. అంతవరకూ తాము నల్లజాతీయులు దరఖాస్తును అనుమతించకపోవడం వంటివి చేయలేదని ఒరానియా అధికారులు పేర్కొన్నారు.

ఇక ఈ నగరంలో ఒక్క నల్లజాతీయుడు కూడా ఉండడానికి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. చాలా మంది ఈ పట్టణాన్ని ఆఫ్రికేతర పట్టణంగా.. వర్ణ వివక్షకు పెద్దపీట వేసే ప్రాంతంగా చూస్తారు. దక్షిణాఫ్రికా నల్ల జాతి అధ్యక్షుడు నెల్సన్ మండేలా దేశంతో సంబంధం లేకుండా వేరుగా ఈ పట్టణాన్ని పునరుద్దరించారు. అలా ఇదొక శ్వేతజాతీయుల పట్టణంగా ఆవిర్భవించింది.