Begin typing your search above and press return to search.
31న హైదరాబాద్ లో ఫ్లై ఓవర్లు బంద్!
By: Tupaki Desk | 28 Dec 2017 3:30 PM GMTకొత్త సంవత్సర వేడుకలకు మరో మూడు రోజుల సమయం ఉండడంతో అటు నగర పోలీసులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 31న (ఆదివారం) రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ రోజున నగరవ్యాప్తంగా దాదాపు 100 బృందాలు ...నగర శివార్ల నుంచి గల్లీల వరకూ అన్ని ప్రాంతాలపైనా ఫోకస్ చేయబోతున్నాయి. తాజాగా, డిసెంబరు 31న హైదారాబాద్ లోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య పేర్కొన్నారు.
గతంలో మాదిరిగా రాత్రంతా సెలబ్రేషన్స్ చేసుకుందామనుకునేవారికి ఇది చేదు వార్తే. హైద్రాబాద్ - సైబరాబాద్ - రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను 31న మూసివేస్తామని శాండిల్య అన్నారు. 31వ తేదీ రాత్రి ఒంటి గంట వరకే సెలెబ్రేషన్స్ చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు. అంతేకాకుండా, డ్రంకన్ డ్రైవ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని - వారి వాహనాలను వెంటనే స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. అతి వేగంతో వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని - వేడుకలకు దూరంగా వ్యక్తుల పట్ల - వేడుకలలో పాల్గొన్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. గల్లీ నుంచి నగర శివార్ల వరకు 100 బృందాలను బ్రీత్ అనలైజర్లతో రంగంలోకి దింపబోతున్నామని తెలిపారు. సేఫ్ న్యూ ఇయర్ వేడుకలే తమ లక్ష్యమని, దానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు నగర పోలీసుల తాజా హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులు న్యూ ఈయర్ వేడుకల నాడు అప్రమత్తంగా ఉండక తప్పదేమో!