Begin typing your search above and press return to search.
బుడ్డ లాడెన్ సీన్లోకి వచ్చేశాడు
By: Tupaki Desk | 13 May 2016 5:22 PM GMTప్రపంచాన్ని తన ఉగ్రవాదంతో గడగడలాడించటమే కాదు.. ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాకు వెన్నులో చలి పుట్టించిన అంతర్జాతీయ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ సంగతి అందరికి తెలిసిందే. ఒకప్పుడు తన ప్రయోజనాల కోసం పెంచి పెద్ద చేసిన అమెరికా.. తర్వాతి కాలంలో ఏకు మేకుగా మారి.. చివరకు అమెరికా మీద విరుచుకుపడి వందలాది అమెరికన్ల ప్రాణాలు తీయటం తెలిసిందే. లాడెన్ మీద పగ పట్టి.. ప్రపంచంలో లాడెన్ జాడ కోసం ఏళ్ల తరబడి పరిశోధించి.. చివరకు పాక్ లో రహస్యంగా బతికేస్తున్న అతగాడిని మెరుపుదాడితో హతమార్చటం.. అతడి శవాన్ని కూడా కనిపించకుండా మాయం చేయటం తెలిసిన చరిత్రే.
లాడెన్ ను హతమార్చటంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెర్రరిస్ట్ అంతమైపోయిందని సంబరపడుతున్న వారికిప్పుడు షాక్ తగిలే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. లాడెన్ ను హతమార్చిన సమయంలోనే అతని కుమారుడ్ని చంపినట్లుగా భావించినా.. లాడెన్ మరో కొడుకు తప్పించుకున్న వైనం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఈ 23 ఏళ్ల హమ్జా బిన్ లాడెన్ తండ్రి మాదిరే అమెరికా మీద రగిలిపోతున్నాడట. తన తండ్రిని దారుణంగా హతమార్చిన వారి మీద పగ తీర్చుకోవాలని తపిస్తున్నాడట. తాజాగా అతడిదిగా చెబుతున్న ఆడియో టేప్ ఒకటి తెర మీదకు రావటం సంచలనంగా మారింది.
సిరియాలోని ముజాహిద్దీన్లంతా తమ విబేధాల్ని పక్కన పెట్టి ఏకం కావాలని పిలుపునివ్వటమేకాదు.. ప్రపంచంలోని ముస్లింలు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు. తన తండ్రికి ఎంతో ఇష్టమైన కవితతో తన ప్రసంగాన్ని షురూ చేసిన బుడ్డ లాడెన్.. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకమైందని.. అందరూ కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు. బుడ్డ లాడెన్ దిగా భావిస్తున్న ఆడియో టేప్ ను మొదట లైట్ తీసుకున్నప్పటికీ.. తాజాగా అందుతున్న సమచారం ప్రకారం.. అమెరికా బుడ్డ లాడెన్ విషయంలో అలెర్ట్ అయ్యిందని.. అతని తీరు మీద ఆందోళన చెందుతుందని చెబుతున్నారు. మరి.. ఇతగాడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడన్న విషయాలు బయటకు రావాల్సి ఉంది.