Begin typing your search above and press return to search.
లాడెన్ కొడుకు రంగంలోకి దిగుతున్నాడా?
By: Tupaki Desk | 13 May 2017 9:10 AM GMTబిన్ లాడెన్ కథ ముగించినందుకు సంబర పడిపోయిన అమెరికా.. ఇప్పుడు అతడి కొడుకు హంజా బిన్ లాడెన్ గురించి ఆందోళన చెందుతోంది. తండ్రి బాటలో హంజా కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారి.. అమెరికానే లక్ష్యంగా దాడులు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తండ్రిని హతమార్చిన అమెరికాపై హంజా ప్రతీకారంతో రగిలిపోతున్నట్లు అమెరికాలో 9/11 దాడులకు సంబంధించిన విచారణ చేపట్టిన ఎఫ్బీఐ మాజీ అధికారి అలీ సౌఫన్ వెల్లడించారు.
2011 మే 2న లాడెన్ ను మట్టుబెట్టిన సమయంలో కొన్ని లేఖల్ని తమ బృందం స్వాధీనం చేసుకుందని.. అందులో ఒక లేఖలో తండ్రి తర్వాత తానే అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తానని.. జిహాద్ మార్గంలో ప్రయాణిస్తానని.. ఏ త్యాగానికైనా తాను సిద్ధమని తండ్రికి మాటిస్తున్నట్లు హంజా పేర్కొన్నాడని సౌఫర్ తెలిపాడు. ఇటీవలే తాను అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారుతున్నట్లు హంజా ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించాడు.
ఇటీవల హంజా రెండు నిమిషాల ఆడియో టేపు రిలీజ్ చేశాడు. ‘‘నేను అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారుతున్నా. అమెరికన్లారా జాగ్రత్త.. అల్ ఖైదా మీ మీద ప్రతీకారం కోసం రగిలిపోతుంటుంది. మేం వేసే ప్రతి అడుగు మీ నాశనానికి దారి తీస్తుంది. ఇరాక్.. అఫ్గానిస్థాన్ లకు మీరు చేసిన ద్రోహాన్ని మేం ఎప్పటికీ మరిచిపోం’’ అంటూ అందులో హంజా హెచ్చరికలు జారీ చేశాడు. హంజా కూడా సరిగ్గా లాడెన్ తరహాలోనే మాట్లాడుతుండటం ప్రమాదానికి హెచ్చరిక అని సౌఫన్ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/