Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఆస్కార్.. ఎందుకోసమంటే?

By:  Tupaki Desk   |   9 Nov 2022 11:30 PM GMT
ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఆస్కార్.. ఎందుకోసమంటే?
X
ఈ ఏడాది మొదటి నుంచి రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలైంది. ఈ సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఆయుధ సంపత్తిలో తమకంటే ఎంతో శక్తివంతమైన రష్యాను ఉక్రెయిన్ సైనికులు వీరోచితంగా ఎదుర్కొంటున్నారు. వీరిని జెలన్ స్కీ ముందుండి నడిపిస్తున్న తీరు అధ్భుతమని ప్రపంచ మీడియా సైతం కొనియాడుతోంది.

ఉక్రెయిన్ తో యుద్ధాన్ని రష్యా ఒకట్రెండు రోజుల్లో ముగిస్తుందని అంతా భావించారు. కానీ జెలెన్ స్కీ వ్యూహంతో రష్యా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ సైనికులను.. ఆ దేశ ప్రజలను యుద్ధానికి సన్నద్ధం చేయడంలో జెలెన్ స్కీ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొక్కవోని ధైర్యంతో గత పది నెలలుగా రష్యాతో యుద్ధాన్ని కొనసాగిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఐదుసార్లు ఆస్కార్ అవార్డును గెలుచుకున్న హలీవుడ్ నటుడు సీన్ పెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని తాజాగా కలుసుకున్నాడు. ఈ సందర్భంగా సీన్ పెన్ తనకు చెందిన ఆస్కార్ అవార్డును జెలెన్ స్కీకి ప్రధానంగా చేశారు. అలాగే తమ దేశ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ను కూడా ప్రధానం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జెలెన్ స్కీతో తాను భేటి అయిన వీడియోను సీన్ పెన్ తన ట్వీటర్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ చేస్తున్న పోరాటాన్ని కీర్తిస్తూ ''ఆయన ఈ యుద్ధం కోసమే పుట్టాడు కాబోలు.. అతని అంతులేని ధైర్యం.. తెగువకు నేను ఫిదా అయ్యానని'' ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే సీన్ పెన్ ఇప్పటి వరకు తన కెరీర్లో ఐదు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాడు. నటుడిగానే కాకుండా రాజకీయంగానూ క్రియాశీలకంగా వ్యవహరిస్తారనే గుర్తింపు పెన్ కు ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆయన తన ఆస్కార్ ను జెలెన్ స్కీకి ఇవ్వడం ద్వారా మరోసారి రాజకీయంగానూ కొత్త చర్చకు పెన్ తెరలేపారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా జెలన్ స్కీ సైతం మంచి నటుడి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. సొంతంగా పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.