Begin typing your search above and press return to search.
ఆస్కార్ అవార్డ్ విగ్రహం ధర తెలిస్తే షాక్!!
By: Tupaki Desk | 26 Feb 2017 8:41 AM GMTవినోద ప్రపంచంలో ఆస్కార్ పురస్కారానికి ఉన్న ప్రతిష్ఠ అంతా ఇంతా కాదు. ఈ పురస్కారం లభిస్తే ఎవరైనా తమ జన్మధన్యమయిందని భావిస్తుంటారు. ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు అందుకోవాలని నటీనటులు కలలు కంటుంటారు. కానీ ఆ అదృష్టం కొంతమందినే వరిస్తుంది. బంగారు వర్ణంలో మెరిసిపోయే ఆ ఆస్కార్ విగ్రహ తయారీకి అయ్యే ఖర్చు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! ఒక ఆస్కార్ విగ్రహం విలువ 10 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.666! కానీ ఒక్కో విగ్రహ తయారీకి అయ్యే ఖర్చు మాత్రం 400 డాలర్లు!
ఆస్కార్ విగ్రహం తయారు చేయడానికి అయ్యే వ్యయం 400 డాలర్లు అయినప్పటికీ నిబంధనల ప్రకారం, ఈ ట్రోఫీని వేలానికి పెట్టడానికి ముందు అకాడమి ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు కేవలం పది డాలర్లకే ఆఫర్ చేయడం తప్పనిసరని ఎంటర్ టైన్ మెంట్ వీక్లీ తెలిపింది. ఈ రూల్‌ను సమర్థిస్తున్న వారిలో ఒకరయిన ఆస్కార్ పురస్కార గ్రహీత స్టీవెన్ స్పీల్ బర్గ్.. బెట్ డేవిస్ - క్లార్క్ గేబుల్ కు చెందిన ఆస్కార్ లపై 1.36 మిలియన్ డాలర్లు వ్యయం చేశారు. వీటిని తిరిగి అకాడమీకి విరాళంగా ఇవ్వడానికే ఆయన అంత వ్యయం చేశారు. 2015లో ఒక కోర్టు కూడా ఈ రూల్ ను సమర్థించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/