Begin typing your search above and press return to search.
ఉస్మానియా.. ఇప్పుడు కేసీఆర్ పై పోరు
By: Tupaki Desk | 19 Sep 2015 11:06 AM GMTఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు చేతిలో ఆయుధం. కానీ ఇప్పుడు అదే ఆయుధం సాక్షాత్తూ ఆయన పైనే తిరగబడుతోంది. కేసీఆర్ నే నామరూపాలు లేకుండా చేయడానికి కంకణం కట్టుకుంది. ఇప్పడు ఉస్మానియాలో ఏ ఒక్కరిని పలకరించినా కేసీఆర్ మీద ద్వేషం పెల్లుబుకుతోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో తొలుత కేసీఆర్ యూనివర్సిటీలకే వెళ్లారు. విద్యార్థులను రెచ్చగొట్టారు. ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత తన ఆయుధం బాల్క సుమన్ ను ప్రయోగించారు. బాల్క సుమన్ తదితరులు ఉస్మానియాలో తిష్ట వేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు లక్షల సంఖ్యలో వస్తాయని నూరిపోశారు. విద్యార్థుల్లో సీమాంధ్ర వ్యతిరేకతను నూరిపోశారు. తెలంగాణ వాదానికి బలం చేకూర్చారు. దాంతో ఉస్మానియా విద్యార్థులంతా తెలంగాణ అంటూ నినదించారు. ఒక్క టీఆర్ ఎస్ నాయకులు తప్ప అక్కడికి ఎవరు వచ్చినా వాళ్ల మీద దాడులు చేశారు. కేసీఆర్ దీక్ష విరమించినప్పుడు ఆందోళన చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమాన్ని ఒక్క తాటిపై నడిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింహ భాగం పాత్ర వారిదే.
అటువంటి ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ వచ్చిన ఏడాదిన్నరగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేశారు. ఇప్పటి వరకు వారికి పనికొచ్చే ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చినా అతి కొద్ది మందికి మాత్రమే దానితో ప్రయోజనం. మిగిలిన నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇక ఉస్మానియాలో మెస్ ల్లో భోజనాల్లేవు. సౌకర్యాలు లేవు. తెలంగాణ వస్తే ఉస్మానియ రూపు మారిపోతుందని చెప్పినా ఆచరణలో ఏమీ జరగలేదు. దీనికితోడు ఉస్మానియా భూములనే పేదలకు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ అన్ని కారణాలతోనూ ఇప్పుడు విద్యార్థులు కేసీఆర్ అంటేనే మండిపడుతున్నారు.