Begin typing your search above and press return to search.

కడుపుమండి.. కేసీఆర్ కు షాకిచ్చారా?

By:  Tupaki Desk   |   21 Aug 2019 7:49 AM GMT
కడుపుమండి.. కేసీఆర్ కు షాకిచ్చారా?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - మంత్రులకు కొందరు తమ బాధను ఈ రకంగా వ్యక్తపరిచి అదిరిపోయే రీతిలో షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ రకంగా కూడా నిరసన తెలుప వచ్చా అనే రీతిలో ప్లాన్ చేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు - ఐఏఎస్ - ఐపీఎస్ లకు అజ్ఞాత వ్యక్తి నుంచి 62 కాటన్ బాక్స్ ల పోస్టల్ లో బుక్ చేశారు. వాటిల్లో ఏవో లిక్విడ్ ను నింపిన బాటిల్స్ ఉంచారు. అయితే కేసీఆర్ - మంత్రుల పేర్లు ఉండడం.. అవి దుర్వాసన రావడంతో పోస్టల్ సిబ్బంది అలెర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు ఈ బాటిల్స్ నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ బాటిల్స్ లో ఉన్నది మురికినీరు అని తేలింది.

అయితే ఆ ప్యాక్ లను విప్పి చూడగా ఓ లేఖ ఉండడం విశేషం. అందులో ఉస్మానియా యూనివర్సిటీలో అందరూ ఇదే నీరు తాగుతున్నారని.. అవే మీకు పంపిస్తున్నామని కేసీఆర్ - మంత్రులకు పోస్ట్ చేశారు. దీంతో ఇది ఓయూలోని తాగునీటి ఇబ్బందులను కేసీఆర్ - మంత్రుల దృష్టికి తీసుకురావడానికే కొందరు కడుపుమండిన స్టూడెంట్స్ తమ నిరసనను ఇలా తెలియజేయడానికే ఇలా చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.