Begin typing your search above and press return to search.
తీవ్ర ఉద్రిక్తంగా మారిన ఉస్మానియా క్యాంపస్
By: Tupaki Desk | 4 Dec 2017 9:48 AM GMTతెలంగాణ ఉద్యమ గడ్డగా పిలిచే ఉస్మానియా క్యాంపస్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కేసీఆర్ సర్కారు కొలువు తీరిన తర్వాత ఇంత భారీఎత్తున నిరసన ప్రదర్శన.. విద్యార్థుల ఆందోళన జరగలేదన్న మాట వినిపిస్తోంది.
ఉస్మానియా క్యాంపస్ పీజీ విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకోవటంతో ఓయూలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు ఆదివారం రాత్రి వేళలో ఓయూ క్యాంపస్ లో విద్యార్దులపై పోలీసుల లాఠీ ఛార్జిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మురళి భౌతికకాయాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు బలప్రయోగం చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మురళి ఆత్మహత్యతో శోకసంద్రంలోకి జారిన ఓయూ విద్యార్థులు.. ఈ రోజు ఉదయం ఆర్ట్స్ కాలేజీ నుంచి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని నిలువరించారు.
మధ్యాహ్నం మరోసారి ఆందోళన చేపట్టారు. విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులు.. పోలీసుల మధ్య వాగ్వాదం పెరగటం.. రాళ్లు రువ్వుకోవటం లాంటి జరిగినట్లుగా చెబుతున్నారు. మురళి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటే.. రాళ్లతో దాడి చేసి.. కవ్వింపు చర్యలకు పాల్పడిన 34 మందిని అరెస్ట్ చేసినట్లుగా డీసీపీ వెల్లడించారు. రాజకీయనేతలు క్యాంపస్ లోకి అడుగుపెట్టటంతోనే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతుండగా.. విద్యార్థి సంఘాలు మాత్రం ఉద్యోగాల నోటిఫికేషన్ రావటంలో ఆలస్యమైందన్న మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. పోలీసులు చూపిస్తున్న ఆత్మహత్య లేఖ నిజం కాదని వారు చెబుతున్నారు.