Begin typing your search above and press return to search.
ఓయూలో పెద్దకూర హైటెన్షన్
By: Tupaki Desk | 10 Dec 2015 5:33 AM GMTఎట్టి పరిస్థితుల్లో ‘‘పెద్ద కూర పండగ’’ను నిర్వహిస్తామని ఒక వర్గం.. వాటిని అడ్డుకుంటామని మరో వర్గం పోటాపోటీగా సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. శపధాలు చేసుకోవటం.. పెద్దకూర పండగ జరుపుకోవటానికి హైకోర్టు అనుమతించని నేపథ్యంలో.. ఉస్మానియా వర్సిటీలో ఇప్పుడు హైటెన్షన్ చోటు చేసుకుంది. ఐదు వేల మందితో పెద్ద కూర పండుగను నిర్వహిస్తామని కార్యక్రమ నిర్వహకులు స్పష్టం చేయటంతో.. అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. బుధవారం రాత్రి ఈ వ్యవహారంపై ఓ ఛానల్ లో వెళ్లి వస్తున్న విద్యార్థి నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసందే. రాత్రివేళలో ఉస్మానియా హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించి మరికొందరు అదుపులోకి తీసుకున్నారు. పెద్దకూర పండుగను క్యాంపస్ లో నిర్వహించకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. పోలీసులు భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేశారు. హాస్టళ్ల వద్ద భద్రతా బలగాల్ని మొహరించారు.
కోర్టు ఆదేశాలకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓయూలో జరిపే పెద్దకూర పండగ విషయంలో హింసాత్మక వ్యాఖ్యలు చేస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తనను అదుపులోకి తీసుకోవటంపై రాజాసింగ్ అగ్రహం వ్యక్తం చేశారు. తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్లుగా వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఓయూలోకి ఎవరిని అనుమతించకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధులకు సైతం.. ఓయూలోకి ప్రవేశాన్ని నిరాకరిస్తున్నారు. కోర్టులు వద్దన్నా.. తాము మాత్రం పెద్దకూర పండుగను నిర్వహించి తీరుతామని ఒక వర్గం విద్యార్థి నాయకులు స్పష్టం చేయటంతో ఉస్మానియా క్యాంపస్ లో ఇప్పుడు హైటెన్షన్ చోటు చేసుకుంది.