Begin typing your search above and press return to search.
రజినీకాంత్ ఎగ్జిట్: పార్టీల స్పందన ఇదీ
By: Tupaki Desk | 30 Dec 2020 10:51 AM GMTరాజకీయాల్లోకి అడుగు పెట్టేది లేదని తేల్చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్ నిర్ణయంపై రాజకీయ వర్గాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. రజినీకాంత్ ను ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తుండగా.. మరికొన్ని పార్టీలకు మాత్రం రజినీకాంత్ వైదొలగడంతో పండుగ చేసుకుంటున్నాయి. రజినీకాంత్ వస్తే రాజకీయంగా నష్టమని భావిస్తున్న అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలకు మాత్రం రజినీ వైదొలగడం చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తోంది.
రజినీకాంత్ ఎగ్జిట్ పై మొదటగా స్పందించిన ఆయన మిత్రుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కావడం గమనార్హం. ‘రజనీ ప్రకటనతో తాను నిరాశ చెందానని, అయితే రాజకీయాల్లోకి రావడం కన్నా ఆయన ఆరోగ్యంగా ఉండడమే తనకెంతో ముఖ్యమని’ వ్యాఖ్యనించారు.ప్రచారం ముగియగానే తాను రజనీని కలుస్తానని ప్రకటించారు. ‘నా రజనీ క్షేమంగా ఉండాలి. ఎక్కడున్నా ఆయన బాగుండాలి’ స్పష్టం చేశారు.
ఇక తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే సైతం రజనీ ప్రకటనపై ఆచితూచి స్పందించింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ మంత్రి మాఫోయ్ పాండ్యరాజన్ మాట్లాడుతూ.. రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు. ఎంజీఆర్ పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ రజనీ ప్రజలకు పిలుపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రజనీ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావముండదని వ్యాఖ్యానించారు.
డీఎంకే అధినేత స్టాలిన్ అన్నయ్య టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి సైతం రజినీకాంత్ వైదొలడంపై బాధపడ్డారు.రజనీకి మనస్సాక్షి వుందని, కానీ బీజేపీ బలవంతంగా ఆయన మనస్సాక్షిని చంపేయాలని ప్రయత్నించి పరాజయం పాలైందన్నారు. తుదిగా రజనీ మనస్సాక్షే గెలిచిందన్నారు. రజనీని రాజకీయాల్లోకి లాగి ఆయన ద్వారా అన్నాడీఎంకే ఓట్లను తమ సొంతం చేసుకోవాలని కుట్ర పన్నిందని, కానీ ఈ ప్రయత్నం విఫలమైందంటూ ఆరోపించారు.
ఇక బీజేపీ సీనియర్ నేత ఇలగణేశన్ మాట్లాడుతూ... దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రజనీ బీజేపీ లాంటి మంచి పార్టీకి మద్దతు ప్రకటించాలని సూచించారు.