Begin typing your search above and press return to search.
బాబు మా రాష్ట్రానికి వద్దంటే వద్దు
By: Tupaki Desk | 18 April 2019 1:30 AM GMT‘బాబు రావద్దు’ అనేది మొన్నటి ఏపీ ఎన్నికల్లో వైసీపీ నినాదాల్లో ఒకటి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే నినాదం అంతర్గతంగా వినిపిస్తుందట. ఇతర రాష్ట్రాల్లో బాబుతో ఏం సంబంధం అనుకోవద్దు. అందుకు కారణం ఉంది.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న భాజపా వ్యతిరేక పార్టీలతో కలిసి సాగుతున్న చంద్రబాబు వారితో మంచి సంబంధాలు మెంటైన్ చేస్తున్నారు. ఆయన ప్రత్యేక హోదా కోసం దిల్లీలో దీక్ష చేసినప్పుడు వారిలో చాలామంది మద్దతు పలికారు.. అలాగే మొన్నటి ఏపీ ఎన్నికల్లోనూ బాబు తరఫున పలువురు నేతలు వచ్చి ప్రచారం చేశారు. ఏపీ ఎన్నికలు మొదటి దశలోనే ముగియడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న బాబు తన మిత్రుల తరఫున ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికి వస్తానని ప్రతిపాదించారు. కానీ... వారు మాత్రం బయటకు చెప్పలేకపోతున్నా ‘బాబు రావొద్దు’ అనుకుంటున్నారట.
బాబు తమ రాష్ట్రంలో ప్రచారానికి రావొద్దు అని ఆయన మిత్రులు అనుకోవడానికి కారణాలున్నాయి. ఏపీలో పోలింగ్ ముగిసిన తరువాత చంద్రబాబు ఈవీఎంలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటం మొదలుపెట్టి దేశం దృష్టిని ఆకర్షించారు. దీనికి ఆయన మిత్రపక్షాల్లో కొందరు నుంచి సానుకూలత ఉన్నా ఇంకొందరు మాత్రం ఆయన పోరాటంపై పెద్దగా ఆసక్తిగా లేరు. తమతమ రాష్ట్రాల్లో బ్యాలట్ విధానం కంటే ఈవీఎంలుంటేనే తాము గెయిన్ అవుతామన్నది వారి అంచనా. పైగా తాము తమతమ రాష్ట్రాల్లో గెలిచే పరిస్థితుల్లో ఉండడం - లోక్ సభ సీట్లలో ఎక్కువ సాధించే అవకాశాలు ఉండడంతో ఈవీఎంలను వ్యతిరేకించడానికి వారు ఇష్టపడడం లేదు.
ఈ పరిస్థితుల్లో బాబు ప్రచారానికి వస్తే... ఆ తరువాత తాము ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే తమ ఫలితాలనూ ప్రజలు శంకించే ప్రమాదముందన్న భయం ఒకటి.. అక్కడి విపక్షాలు కూడా చంద్రబాబులా ఈవీఎంలను సాకుగా చూపి తమను ఇరుకున పెట్టే ప్రమాదమూ ఉందన్న కోణంలో వారు బాబు తమ తరఫున ప్రచారానికి రాకపోవడమే నయమన్న ఉద్దేశంలో ఉన్నారట. పైగా బెంగాల్ వంటి చోట్ల చంద్రబాబు వెళ్లినా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి మమత కూడా అస్సలు ఆసక్తి చూపలేదని సమాచారం.