Begin typing your search above and press return to search.
భారత్ లో ఓటీటీ మార్కెట్ రేంజ్ ఎంతో చెప్పే నివేదిక!
By: Tupaki Desk | 3 Jan 2022 3:28 AM GMTప్రపంచంలో రెండు దేశాలకు మాత్రమే కుదిరే మార్కెట్. అందులో ఒకటి చైనా అయితే.. రెండోది భారత్. చైనాకు సంబంధించి పరిధిలు.. పరిమితులు ఉంటాయి. కానీ.. భారత్ అందుకు భిన్నం. అసలుసిసలు స్వేచ్ఛా మార్కెట్. సరిగా ఫోకస్ చేయాలే కానీ కాసుల వర్షం కురుస్తుంది. సరిగ్గా ఇదే విషయాన్ని చెప్పింది తాజా నివేదిక ఒకటి. భారత్ లో ఓటీటీ మార్కెట్ స్థాయి ఎంతన్న విషయాన్ని లెక్క కట్టి.. నివేదిక సిద్ధం చేసింది. మహమ్మారి కరోనా పుణ్యమా అని.. నెలల వ్యవధిలో అందరి నోళ్లల్లో నానటమే కాదు.. ఇప్పుడు ఓటీటీ కనెక్షన్లు లేని ఇల్లు లేదన్నట్లుగా పరిస్థితి మారింది. ఇది కూడా ఆరంభం మాత్రమే.
రానున్న రోజుల్లో ఈ తీరు మరింత ఎక్కువ అవుతుంది. ఇదే విషయాన్ని వెల్లడించింది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు. అంతర్జాతీయ సంస్థ అయిన బోస్టన్.. భారత్ లో ఓటీటీ మార్కెట్ విస్తృతి ఎంతన్న అంశంపై పరిశ్రమ సమాఖ్య సీఐఐతో కలిసి సంయుక్త నివేదికను తయారు చేసింది. వచ్చే పదేళ్లలో సరాసరిన ఏడాదికి 22-25 శాతం వార్షిక వృద్ధి రేటుతో సుమారు రూ.97,500 - రూ.1,12,500 కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు.
అందుబాటు ధరలోకి అధికవేగమైన ఇంటర్నెట్ అందుబాటులోకి రావటం.. దాని వినియోగం పెరగటం.. డిజిటల్ చెల్లింపులకు ప్రజలు అలవాటు పడటం.. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరగటం ఓటీటీ వ్యాపారానికి కలిసి వస్తుందన్న అంచనా వేస్తున్నారు. నిజానికి ప్రపంచాన్ని ఏలే నెట్ ఫ్లిక్స్.. అమేజాన్ ప్రైమ్.. డిస్నీ ప్లస్ లాంటి అంతర్జాతీయ ఓటీటీ సంస్థలు అమెరికాలో వసూలు చేసే ఛార్జీలతో పోలిస్తే భారత్ లో 70 నుంచి 90 శాతం తక్కువ ధరకే తమ సేవల్ని అందిస్తున్నాయి. కానీ.. భారత్ లాంటి భారీ మార్కెట్ లో ఒకసారి కుదురుకున్న తర్వాత.. కురిసేదంతా కాసుల వర్షమే.
ఇప్పటికే తమకు అందుబాటులో ఉన్న కంటెంట్ కు లోకల్ కంటెంట్ జత చేర్చటం ద్వారా ప్రజల మనసుల్ని దోచుకునే అవకాశం ఉంటుంది. ఒరిజనల్ కంటెంట్ మీద మరికాస్త ద్రష్టి పెట్టాలంతే. సబ్ స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ కంటెంట్ కుకొన్నేళ్లుగా పెరుగుతున్న గిరాకీ.. ప్రకటనల ఆధారిత వీడియోలను అధిగమించే వీలుంది.
భారత మీడియా.. వినోద రంగం కొవిడ్ పూర్వ స్థాయికి చేరుకున్నట్లుగా ఈ నివేదిక పేర్కొంది. 2030 నాటికి 10-12 శాతం వార్షిక వృద్ధి రేటుతో సుమారు రూ.4,12,500 కోట్ల నుంచి రూ.5,25,000 కోట్లకు చేరే అవకాశం ఉందని తెలిపింది. దేశీయంగా 40కు పైగా సంస్థలు కంటెంట్ ఇవ్వటంలో పోటీ పడుతున్న వేళ.. భారత్ మార్కెట్ లో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి మరింత పోటీ పెరగటం ఖాయమని చెప్పక తప్పదు.