Begin typing your search above and press return to search.

ఇక‌పై శ్రీ‌రెడ్డికి స‌పోర్ట్ ఇవ్వం: ఓయూ జేఏసీ

By:  Tupaki Desk   |   18 April 2018 2:30 PM GMT
ఇక‌పై శ్రీ‌రెడ్డికి స‌పోర్ట్ ఇవ్వం: ఓయూ జేఏసీ
X
జ‌న‌సేన అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను న‌టి శ్రీ‌రెడ్డి అభ్యంత‌ర‌క‌ర ప‌దజాలంతో దూషించ‌డంపై స‌ర్వ‌త్రా తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు తీవ్రంగా ఖండించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, నేడు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు - న‌టి హేమ‌ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ - హీరో కృష్ణుడు కూడా శ్రీ‌రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. ప‌వ‌న్ పై చేసిన‌ వ్యాఖ్య‌ల‌కు తాజాగా శ్రీ‌రెడ్డికి కోలుకోలేని డ్యామేజీ జ‌రిగింది. ప‌వ‌న్ పై శ్రీ‌రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఆమెకు త‌మ మ‌ద్ద‌తును ఉప‌సంహ‌రించుకుంటున్నామ‌ని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయ‌కుడు సంప‌త్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. టాలీవుడ్ లో మ‌హిళ‌లు ఎదుర్కొంటోన్న కొన్ని స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు తాము ఆమెకు పూర్తి మ‌ద్ద‌తు తెలిపామ‌ని, కానీ, ఈ విధంగా వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇక‌పై ఆమెకు మ‌ద్ద‌తు ఇవ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ కు వ్య‌తిరేకంగా పోరాడుతోన్న అపూర్వ‌ - మిగ‌తా జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు త‌మ మ‌ద్ద‌తు య‌థావిధిగి కొన‌సాగుతుంద‌ని, తాము శ్రీ‌రెడ్డికి మాత్ర‌మే మ‌ద్ద‌తును ఇవ్వ‌బోమ‌ని తేల్చి చెప్పారు.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ - మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై న‌టి శ్రీరెడ్డి కొద్ది రోజులుగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌రెడ్డికి మ‌ద్దతుగా ప‌లు మ‌హిళా సంఘాలతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ కూడా బాస‌ట‌గా నిలిచింది. శ్రీ‌రెడ్డి చేస్తున్న పోరాటానికి తాము అండ‌గా నిలుస్తామ‌ని చెప్పిన‌ ఓయూ విద్యార్థి జేఏసీ....ఫిల్మ్‌ చాంబర్‌ ఎదుట ధర్నా కూడా నిర్వహించింది. ఆ త‌ర్వాత జూనియ‌ర్ ఆర్టిస్టులు, మ‌హిళా సంఘాలు క‌లిసి ఏర్పాటు చేసిన జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ లో ఓయూ జేఏసీ కూడా భాగ‌స్వామిగా ఉంది. ఆ క‌మిటీ ఏర్పాటు చేసిన చ‌ర్చా వేదిక‌ల్లో కూడా ఓయూ జేఏసీ నాయ‌కుడు సంప‌త్ పాల్గొని ప్ర‌సంగించారు. శ్రీ‌రెడ్డి స‌మ‌స్య‌ల‌పై అంద‌రి మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న త‌రుణంలో .....అస‌లు స‌మ‌స్య ప‌క్క‌దోవ ప‌ట్టించేలా శ్రీ‌రెడ్డి ....ప‌వ‌న్ పై చేసిన వ్యాఖ్య‌లు త‌మ‌ను ఎంతో బాధించాయ‌ని సంప‌త్ తెలిపారు. బడుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు ప‌వ‌న్ అండ‌గా ఉంటార‌ని త‌మతో గ‌తంలో చెప్పార‌ని, అందుకే ఆయ‌నకు త‌మ జేఏసీ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని....మీరంతా కూడా ప‌వ‌న్ కు మ‌ద్ద‌తు తెలపాల‌ని....శ్రీ‌రెడ్డి, మిగ‌తావారికి కూడా చెప్పామ‌ని అన్నారు. ప‌వ‌న్ పై శృతి చేసిన వ్యాఖ్య‌లపై కూడా తానే క్ష‌మాప‌ణ చెప్పించాన‌ని, అపూర్వ గారి చేత కూడా అంద‌రి త‌ర‌ఫున సారీ చెప్పించాన‌ని సంప‌త్ అన్ఆన‌రు. అయితే, తాము వెళ్లిపోయిన త‌ర్వాత శ్రీ‌రెడ్డి....మీడియాతో మాట్లాడుతూ...ప‌వ‌న్ ను దూషించ‌డం స‌రికాద‌ని, ఆమె వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నామ‌ని సంప‌త్ అన్నారు. ఆ వ్యాఖ్య‌ల‌కు తాము చాలా బాధ‌ప‌డుతున్నామ‌ని, అందుకే శ్రీ‌రెడ్డికి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రిస్తున్నామ‌ని చెప్పారు. తాము శ్రీ‌రెడ్డికి వ్య‌క్తిగ‌తంగా మ‌ద్ద‌తివ్వ‌లేద‌ని, క్యాస్టింగ్ కౌచ్ - మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాలపై స్పందించామ‌ని...ఇక‌పై కూడా స్పందిస్తామ‌ని చెప్పారు. ఇక‌నైనా....త‌న ప్ర‌ధాన పోరాటంపై శ్రీ‌రెడ్డి ఫోక‌స్ చేయాల‌ని, అస‌లు విష‌యం వ‌దిలేసి సైడ్ ట్రాక్ లోకి వెళ్ల‌వ‌ద్ద‌ని సంప‌త్ సూచించారు.