Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఎమ్మెల్యే హోటల్ని ధ్వంసం చేశారు
By: Tupaki Desk | 25 May 2015 12:14 PM GMTతెలంగాణ రాష్ట్ర అధికారపక్షానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తాను మొండివాడినని.. తాను అనుకున్న పనిని పూర్తి చేసే వరకూ వెనక్కి తగ్గనంటూ తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యకు.. ఉస్మానియా విద్యార్థులు ఇచ్చిన సమాధానం తెలంగాణ అధికారపక్షానికి షాక్‌కు గురి చేయటం ఖాయం.
అంత పెద్ద రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలోనూ.. ఏ వాణిజ్య సంస్థల మీద దాడికి చేయని ఉస్మానియా విద్యార్థులు.. తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ సాధనకు కీలక భూమిక పోషించామని చెప్పే ప్రభుత్వ హయాంలో.. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆస్తులపై దాడి చేయటం సంచలనంగా మారింది. ఉస్మానియా వర్సిటీకి ఉన్న భూముల్ని సేకరించి పేదలకు ఇళ్లు కట్టిస్తానని చెప్పటం.. దీనికి ఉస్మానియా విద్యార్థులు.. విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. ఉస్మానియా వర్సిటీకి చెందిన భూముల్ని ఆక్రమించుకొని హబ్సిగూడలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిర్మించారన్న ఆరోపణలున్న స్వాగత్ గ్రాండ్ హోటల్‌పై పలువురు ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు రాళ్ల దాడి చేశారు.
అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న పరిసరాలు ఉస్మానియా విద్యార్థుల దాడితో ఒక్కసారి వేడెక్కిపోయాయి. ఊహించని రీతిలో పదుల సంఖ్యలో వచ్చిన విద్యార్థులు ఒక్కసారి రాళ్లదాడికి పాల్పడటంతో కలకలం రేగింది. ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునేసరికే.. హోటల్ ఫర్నీచర్ ధ్వంసమైంది. వర్సిటీకి చెందిన భూముల్లో నిర్మించిన హోటళ్లు.. కాంప్లెక్సులు నిర్మించిన వారి అంతు చూస్తామని ఇటీవలే విద్యార్థి జేఏసీ హెచ్చరించింది.
ఈ విషయాన్ని ఎప్పటిమాదిరే లైట్ తీసుకున్న వారికి ఊహించని విధంగా ఓయూ నేతలు షాక్ ఇచ్చారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన వచ్చి విద్యార్థుల్ని చెదరగొట్టారు.
దాడికి పాల్పడిన విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విద్యార్థి జేఏసీ నేతలు.. ఉస్మానియా భూములు పరిరక్షించాలని మానవహక్కుల కమిషన్‌లో పిటీషన్ దాఖలు చేశారు. వర్సిటీ భూములు ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు.. అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యేపైనే రావటం.. దాడి జరగటం.. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ఉస్మానియా విద్యార్థులే ఈ చర్యకు పాల్పడటం లాంటి తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారే అంశాలనటంలో సందేహం లేదు.