Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను స‌న్మానించారు.​దేంతోనో తెలుసా?​

By:  Tupaki Desk   |   28 Aug 2015 4:34 AM GMT
కేసీఆర్‌ ను స‌న్మానించారు.​దేంతోనో తెలుసా?​
X
చీప్‌ లిక్కర్ అమ్మ‌కాన్ని తెలంగాణ ప్రభుత్వమే చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్ప‌దం అవుతోంది. ఇప్ప‌టికే మ‌హిళా సంఘాలు, రాజ‌కీయ పార్టీలు ఈ విష‌యంలో నిర‌స‌న తెలుపుతుండ‌గా....మ‌రోవైపు రోజురోజుకు ఈ విష‌యంలో ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి. ఉద్య‌మాల‌కు ఊపిరి, తెలంగాణ పోరాటంలో కీల‌క పాత్ర పోషించిన ఉస్మానియా యూనివ‌ర్సిటీలో తాజాగా ఒకింత భిన్నంగా ఆందోళ‌న చేప‌ట్టారు.

చీప్ లిక్క‌ర్‌ ను ప్ర‌భుత్వం అమ్మ‌డాన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థు లు కేసీఆర్‌ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద కేసీఆర్‌ చిత్రపటానికి చీప్‌ లిక్కర్‌ సీసాలతో దండ వేసి అనంతరం లిక్కర్‌ తో అభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్‌ కోటూరి మానవతారాయ్‌ మాట్లాడుతూ సామాన్యుల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడే విధానాల‌ను ప్ర‌భుత్వం ఉప‌సంహిరించుకోవాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన ఖజానాను నింపుకునేందుకు చీప్‌ లిక్కర్‌ తో చీప్‌ పాలిటిక్స్‌ చేస్తోందన్నారు. ఎంతోమంది త్యాగాలు, విద్యార్థులు, తెలంగాణ ప్రజల ఉద్యమాలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ అబాసు పాలే చేస్తున్నారన మండిప‌డ్డారు. ఆదాయం కంటే ప్ర‌జ‌ల ప్రాణాల‌కు విలువ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

చీప్ లిక్క‌ర్‌ పై వెన‌క్కు త‌గ్గేది లేద‌ని ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు నిర‌స‌న‌ల ఉధృతి పెరిగిపోతోంది. మొత్తంగా తెలంగాణలో చీప్‌ లిక్క‌ర్ ర‌స‌వ‌త్త‌ర ప‌రిస్థితుల‌కు వేదిక అయింద‌ని భావిస్తున్నారు.