Begin typing your search above and press return to search.
మళ్లీ రగిలిన ఓయూ
By: Tupaki Desk | 17 March 2015 10:19 AM GMTతెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకభూమిక పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోసారి భగ్గుమంది. తెలంగాణ రాష్ట్ర సర్కారు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉస్మానియా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ఎన్నికల సందర్భంగా లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పిన టీఆర్ ఎస్ సర్కారు.. ప్రభుత్వం ఏర్పాటు అయి పది నెలలు అవుతున్న పది ఉద్యోగాల్ని కూడా ఇవ్వలేదని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. టీఆర్ ఎస్ సర్కారు వెనువెంటనే స్పందించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు.
తెలంగాణ సర్కారు తీరుకు నిరసనగా ర్యాలీ నిర్వహించిన విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు.. విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో క్యాంపస్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీకి వెనువెంటనే తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.