Begin typing your search above and press return to search.
ఇంచు భూమిని టచ్ చేసినా...
By: Tupaki Desk | 23 May 2015 4:07 AM GMTకలల తెలంగాణ సాకారం అయితే.. తెలంగాణకు సీమాంధ్రుల పాలన నుంచి విముక్తి అని భావించి.. వీరోచిత పోరాటాలు చేస్తూ.. వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసిన త్యాగం ఒక్కమాటతో పూర్తి చేసేది కాదు.
ప్రత్యేక తెలంగాణలో.. తెలంగాణ సమాజంలోని బడుగు.. బలహీన వర్గాల భవితను పూర్తిగా మారుస్తుందని నమ్మిన లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి మరీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. రాష్ట్రం ఏర్పడి.. ఉద్యమనేతలే పాలకులుగా మారిన నేపథ్యంలో తమ బతుకులు మారిపోతాయన్న భావనలో ఉన్న వారికి భిన్నమైన నిర్ణయాలతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న పరిస్థితి.
తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించటమే కాదు.. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు విద్యార్థి లోకంలో కలకలం సృష్టిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం.. వారికి అవసరమైన పరిశోధనా సంస్థలు.. ఇతర విద్యా సంస్థల కోసం కాకుండా.. పేదల పేరుతో ఉస్మానియా భూముల్ని స్వాధీనం చేసుకోవాలన్న తెలంగాణ రాష్ట్ర సర్కారు తలంపుపై తీవ్ర అలజడి వ్యక్తమవుతోంది.
ఉస్మానియాలోని పలు విద్యార్థి సంఘాలు ఏకం కావటమే కాదు.. వారంతా కేసీఆర్ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. వినూత్న నిరసనలకు తెర తీస్తున్నారు. తాజాగా కేసీఆర్ సర్కారు బుద్ధి మారాలంటూ ఉస్మానియా వర్సిటీలోని సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక.. ఉస్మానియా భూముల్ని స్వాధీనం చేసుకోవటానికి తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రకటనలపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా విరుచుకుపడుతూ.. పెద్దపెద్ద హెచ్చరికలే చేస్తున్నారు. వర్సిటీకి చెందిన ఇంచు భూమిని తెలంగాణ సర్కారు టచ్ చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆర్ట్స్ కాలేజీ కింద బంద పెట్టేస్తామంటున్నారు. ఉస్మానియాను విచ్ఛిన్నం చేసేందుకు తెలంగాణ అధికారపక్షం కుట్ర పన్నుతోందని వారు మండిపడుతున్నారు.
అంతేకాదు.. వర్సిటీ భూముల విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై.. రాష్ట్రపతి.. ప్రధాని.. రాష్ట్ర గవర్నర్లకు లేఖలు రాయాలని నిర్ణయించారు. మొత్తానికి వర్సిటీ భూముల వ్యవహారంపై భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇంత తీవ్ర వ్యతిరేకతపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో..?