Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు ఆయనొక్కడుంటే చాలు..

By:  Tupaki Desk   |   4 Jun 2019 8:50 AM GMT
కాంగ్రెస్ కు ఆయనొక్కడుంటే చాలు..
X
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి.. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. నాడు వైఎస్ హయాంలో మంత్రిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పిన నేత.. నాడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ముప్పుతిప్పలు పెట్టి గులాబీ పార్టీని నామరూపల్లేకుండా చేయడంలో వైఎస్ కు తోడ్పాటునందించింది జీవన్ రెడ్డినే...

కేసీఆర్ ను రెచ్చగొట్టి కరీంనగర్ ఎంపీకి రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో జీవన్ రెడ్డిని నిలబెట్టి వైఎస్ వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు.. కేసీఆర్ ఓటమి అంచులవరకు తీసుకెళ్లిన జీవన్ రెడ్డి ఓడించలేకపోయాడు. అయితే కేసీఆర్ ను ఢీకొట్టిన నేతగా పేరుంది.

అందుకే మొన్నటి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తన నాన్న కేసీఆర్ ను ఇబ్బందిపెట్టిన జీవన్ రెడ్డిని ఆయన పోటీచేసిన జగిత్యాల నియోజకవర్గంలో ఓడించి మాజీ ఎంపీ కవిత ప్రతీకారం తీర్చుకుంది. కానీ ఆయన ఆరు నెలలు తిరగకుండానే పట్టుభద్రుల ఎమ్మెల్సీగా పోటీచేసి మళ్లీ చట్టసభలకు జీవన్ రెడ్డి వచ్చాడు. జీవన్ రెడ్డిని అసెంబ్లీలో అడుగుపెట్టనీయను అని శపథం చేసిన కవిత.. చివరకు తనే నిజామాబాద్ లో ఓడి పార్లమెంట్ గడప తొక్కని పరిస్థితి ఎదురైంది.

అయితే జీవన్ రెడ్డి లాంటి గండరగండర నేత ఇప్పుడు శాసనమండలిలో కాంగ్రెస్ కు కొండంత బలం.. బలగం.. అందుకే మూడు స్థానిక సంస్తల ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయినా కానీ తమకు జీవన్ రెడ్డి ఒక్కడు చాలని..మండలిలో 25మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్సీలతో సమానమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించాడంటే జీవన్ స్టామినాను అర్ధం చేసుకోవచ్చు.

ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ వద్ద కూడా డబ్బులు అయిపోయాయని.. ఖర్చు పెట్టలేక కోమటిరెడ్డి లక్ష్మీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకోలేకపోయారని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా అధికారంలో ఉన్నవాళ్లకే సీట్లు అన్న నానుడి నిజమైందన్నారు జగ్గారెడ్డి.