Begin typing your search above and press return to search.
ఔట్ డేటెడ్ లీడర్లు - అవినీతి నేతలే..బీజేపీకి ఏపీలో గతి?
By: Tupaki Desk | 29 Nov 2019 2:30 PM GMTఏపీలో తాము బలోపేతం అవుతామంటూ, ఏపీలో తామే రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామంటూ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటూ ఉంది. ఎన్నో రాష్ట్రాల్లో తమకు ఒక్క సీటు లేని స్థితి నుంచి తాము ఎదిగామంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉంటారు. అమిత్ షా, మోడీలు చాణుక్యులు అంటూ, వారి పేరుతో ఏపీలో కూడా బలోపేతం అవుతామంటూ వారు ప్రకటించుకుంటూ ఉంటారు.
అయితే ఇక్కడ రెండు విషయాలున్నాయి. మొదటిది ఏపీలో బీజేపీ ఎదగాలంటే, ముందుగా ఆ రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి. కేంద్రంలో అధికారం చేతిలో ఉంది బీజేపీకి. అలాగే ఏపీకి ప్రత్యేకహోదా హామీనీ బీజేపీనే ఇచ్చింది. ఎన్నికల ముందు, విభజన సమయంలో బీజేపీ ఆ హామీలు ఇచ్చింది. అయితే ఆరేళ్లుగా అధికారాన్ని చేతిలో పెట్టుకుని కూడా బీజేపీ ఏపీకి ప్రత్యేకహోదాను ఇవ్వలేదు. ఎన్నికల హామీగా కూడా ఆ అంశాన్ని పేర్కొని మోసం చేసింది కమలం పార్టీ.
అందుకు సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాన్ని అనుభవించింది. ఒక్క శాతం లోపు ఓట్లకు పరిమితం అయ్యింది. ఇక తెలుగుదేశం నుంచి చేరికల ద్వారా బలపడాలి అనేది భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్న రెండో ప్రణాళిక. ప్రజలకు ఏం చేయకున్నా ఫర్వాలేదు, నేతలను చేర్చుకుని బలోపేతం కావాలని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది.
ఇది మరో కామెడీ. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఏపీలో దొరుకుతున్న నేతలు రెండు రకాలు, వారిలో ఒకటి అవినీతి ఆరోపణలతో ఉన్న వారు, రెండు.. ఔట్ డేటెడ్ అయిన వాళ్లు.
తెలుగుదేశం పార్టీ హయాంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన వారు ఇప్పుడు కేసుల భయంతో భారతీయ జనతా పార్టీ వైపు చేరుతూ ఉన్నారు. బీజేపీలోకి చేరి.. వారు కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నట్టుగా ఉన్నారు. సీబీఐ-ఈడీ దాడులను ఎదుర్కొన్న వారు కూడా బీజేపీలోకి చేరి షెల్టర్ తీసుకుంటున్నారు.
అలాంటి వారికి ప్రజాబలం కూడా లేదు. ఇక కొంతమంది ఔట్ డేటెడ్ నేతలను కూడా బీజేపీ చేర్చుకుంటూ ఉంది. ఆ జాబితాలోని తాజా పేరు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. ఈయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి హల్చల్ చేశారు. అప్పుడు నానా కహానీలు చెప్పారు. ఆయన ఇప్పుడు బీజేపీలోకి చేరారు.
సొంత కుటుంబ సభ్యులు కూడా బైరెడ్డి వెంట రాజకీయ ప్రయాణం చేయడం లేదు. అలాంటిది ఇలాంటి వారిని చేర్చుకుని బీజేపీ ఏం సాధిస్తుందో!